ఆంధ్రప్రదేశ్‌లో రాముని విగ్రహం ధ్వంసం చేసిన ఘటన మరువక ముందే విశాఖ ఏజెన్సీ పాడేరు ఘాట్ రోడ్లో అమ్మవారి విగ్రహం, పాదాలు విరగ్గొట్టారు. రెండు రోజుల కిందటే దుండగులు.. అమ్మవారి పాదాలు పగుల కొట్టినట్లు స్థానికులు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఈ విధ్వంసానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.
ఘాటికొండ మలుపులో ఉండే ఈ అమ్మవారికి.. చుట్టుపక్కల నాలుగు పంచాయతీల్లోని ముప్పై గ్రామాల ప్రజలు మెుక్కులు తీర్చుకుంటారు. విగ్రహం ధ్వంసం చేసిన వారిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
ఇదీ చదవండి: మంచుతెర మాటున ట్యాంక్‌బండ్ అందాల కనువిందు