ETV Bharat / state

'నిరంతరం కొత్తరూపంలోకి వైరస్‌.. సమగ్ర అధ్యయనం అవసరం'

కరోనాను కట్టడి చేయడంలో వ్యాక్సినే శక్తిమంతమైన ఆయుధం. వైరస్‌ ఎప్పటికప్పుడు కొత్త రూపం తీసుకుంటోంది. దీని గురించి తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు జన్యుక్రమ విశ్లేషణ కొనసాగాలి. రెండోవేవ్‌ ఇంతగా నష్టపరచడానికి కారణం వైరస్‌ జన్యుక్రమాన్ని అధ్యయనం చేయడంలో చోటుచేసుకున్న నిర్లక్ష్యమే. మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్తపడాలి, వ్యాక్సినేషన్‌ వేగవంతం చేయాలి అంటున్నారు ప్రముఖ వైరాలజిస్టు డా.జాకబ్‌జాన్‌. ఐసీఎంఆర్‌ సెంటర్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ రీసెర్చి ఇన్‌ వైరాలజీ మాజీ డైరెక్టర్‌గా, వెల్లూరులోని క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజీ క్లినికల్‌ వైరాలజీ విభాగం అధిపతిగా పనిచేసిన జాకబ్‌ కరోనా తీవ్రత, మూడోదశలపై ఈనాడు-ఈటీవీ భారత్ ముఖాముఖిలో పలు విషయాలను వెల్లడించారు.

icmr-center-for-advanced-research-in-virology-former-director-jacob-interview-on-covid
'నిరంతరం కొత్తరూపంలోకి వైరస్‌.. సమగ్ర అధ్యయనం అవసరం'
author img

By

Published : May 19, 2021, 8:13 AM IST

ఇతర దేశాలతో పోల్చినపుడు భారతదేశంలో రెండోదశ ఇంత తీవ్రంగా ఉండడానికి కారణమేంటి?

రెండోదశ తీవ్రతకు రెండు అంశాలు కారణం. మొదటిది వైరస్‌ మార్పు చెందడాన్ని, మొదటి వేవ్‌ కంటే చాలా ఎక్కువ తీవ్రతతో విస్తరించడాన్ని గుర్తించలేకపోవడం. ఈ విషయాలను పర్యవేక్షించడానికి పది పరిశోధనశాలలకు కేంద్రం బాధ్యతను అప్పగించింది. ఇవన్నీ కలిసి 'ది ఇండియన్‌ సార్స్‌ కొవిడ్‌-2 జినోమిక్‌ కన్సార్షియం'గా ఏర్పడ్డాయి. కానీ నాకున్న సమాచారం మేరకు ఇవి పూర్తి స్థాయిలో పరిశోధనలు చేయడానికి అవసరమైన నిధులను సమకూర్చలేదు. రెండో దశ ప్రారంభమైన తర్వాత మాత్రమే కొత్త రకాలు ఇందులో ఉన్నాయన్న విషయాన్ని ఈ కన్సార్షియం గుర్తించింది. రెండోది ప్రభుత్వం ప్రజలు భారీ ఎత్తున గుమిగూడే కార్యక్రమాలకు అనుమతించడం. ప్రజలు కరోనా వెళ్లిపోయిందని భావించి మాస్కు లేకుండానే పెద్దఎత్తున గుమికూడడం, వివిధ కార్యక్రమాలకు హాజరవడంతో వైరస్‌ కొత్త రకాలు వేగంగా విస్తరించాయి. ఎన్నికల ర్యాలీలు, ప్రచారాలు కూడా కొవిడ్‌ వ్యాప్తికి కారణమయ్యాయి.

టీకాలు ఎంత బాగా పని చేస్తాయన్న దానిపై రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. మీరేమంటారు.?

వ్యాక్సిన్లు బాగా పని చేస్తాయా లేదా అన్న ఆందోళనకు ఎలాంటి గణాంకపరమైన ఆధారం లేదు. వ్యాక్సిన్ల వల్ల కచ్చితంగా ఎక్కువ రక్షణ ఉంటుంది. అయితే మనం అవసరమైన మేరకు సరఫరా చేయడంలోనే విఫలమయ్యాం. దీంతో కొంత మంది రెండో వేవ్‌ను నిరోధించడంలో వ్యాక్సిన్లు సాయపడలేదని అంటున్నారు. రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకొన్నవారికి వైరస్‌ నుంచి రక్షణ చాలా ఎక్కువ ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

ప్రస్తుత పరిస్థితులలో వైరస్‌ జన్యుక్రమం విశ్లేషణ పాత్ర ఏంటి?

చాలా ముఖ్యమైంది. ఎందుకంటే వైరస్‌లో మార్పులు చాలా వేగంగా జరుగుతున్నాయి. కొన్ని మ్యుటేషన్స్‌ మొదటి వేవ్‌ కంటే తీవ్రమైనవి వస్తున్నాయి. ఇంతకు ముందు వ్యాధి సోకడం, లేదా వ్యాక్సినేషన్‌ వల్ల లభించిన రోగ నిరోధక శక్తిని తప్పించుకొనే రకాలు కూడా ఉద్భవిస్తున్నాయని చెబుతున్నారు. వీటి గురించి ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మ్యుటేషన్స్‌ను మనం నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. ప్రతి వారం వైరస్‌ నమూనాల జన్యుక్రమం రూపొందించాలి. కొత్త రకాలు వస్తుంటే వెంటనే గుర్తించాలి.

వ్యాక్సిన్‌ తగినంతగా లేదా సరైన విధంగా వేయకపోవడం వల్ల వైరస్‌ వ్యాక్సిన్‌కు కూడా లొంగనంత మొండిగా మారుతుందనే అభిప్రాయం కొందరు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఏమంటారు?

సిద్ధాంతపరంగా ఇది సాధ్యమే కానీ వాస్తవంగా కాదు. ఇలా జరిగే అవకాశం చాలా తక్కువ. తగినంతగా వ్యాక్సినేషన్‌ జరగకపోవడం అంటే ఏంటి? ఒక డోసు మాత్రమే ఇవ్వడమా... లేక ప్రజల్లో కొంత భాగానికి మాత్రమే వ్యాక్సిన్‌ వేయడమా? ఇలాంటి తప్పుడు వాదనలతో ప్రజలు వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉండడం సరైంది కాదు. ఇజ్రాయెల్‌ లాంటి దేశాలు ఎక్కువ జనాభాకు వ్యాక్సిన్‌ వేయడం ద్వారా వైరస్‌ వ్యాప్తిని గణనీయంగా తగ్గించగలిగాయి. మనం కూడా ఎంత త్వరగా... ఎంత ఎక్కువమందికి వ్యాక్సిన్లు వేయగలం అన్నది ముఖ్యం.

ఇప్పుడు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి?

తక్షణం చేయాల్సింది సమూహాలుగా చేరకుండా చూడటం, మాస్కులు ధరించడం గురించి ప్రజల్లో అవగాహన పెంచడం. టీకాలను సత్వరమే అందరికీ వేయడం.

ఈ సంక్షోభం ఎప్పుడు ముగిసే అవకాశం ఉంది?

వైరస్‌ ఎక్కడికీ పోదు. అయితే ప్రస్తుత తీవ్రత, సంక్షోభం జూన్‌ ఆఖరుకు ఆగిపోయే అవకాశం ఉంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో వైరస్‌ ఉద్ధృతి అతి తీవ్ర స్థాయికి దగ్గరగా ఉంది. జాతీయ స్థాయిలో చూసినపుడు మే 6 నుంచి తగ్గుముఖం పట్టడం ప్రారంభించింది.

ప్రస్తుత పరిస్థితిని పరిగణనలోకి తీసుకొంటే మూడో దశకు అవకాశం ఎంత? తీవ్రత ఎలా ఉండబోతోంది?

రెండో వేవ్‌ విస్తృతి, వేగం నాకు ఆశ్చర్యం కలిగించాయి. మొదటిది వుహాన్‌ వైరస్‌. తర్వాత డి.614 వేరియంట్‌ వచ్చింది. అయితే దీనివల్ల రెండో దశ వచ్చిందని చెప్పలేం. రెండోవేవ్‌కు ప్రధాన కారణం యు.కె.బి.1.1.7, దక్షణాఫ్రికా 3.1.351, బ్రెజిల్‌ బి.1.1.7 వైరస్‌ రకాలు. వీటితో పాటు భారత్‌ రకాలుగా భావిస్తున్న బి.1.617, బి.1.618 కూడా విజృంభించాయి. వైరస్‌లో ఇంకో రకం తీవ్రమైన ఉధృతితో వచ్చి దాన్ని తట్టుకునే రోగనిరోధక శక్తి మనలో లేకపోతే మూడో దశలో కూడా సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. అంటువ్యాధులను నిరోధించడంలో టీకాలు చాలా శక్తివంతమైన ఆయుధాలు. కానీ మన దగ్గర వ్యాక్సిన్లు వేయడంలో తీవ్ర జాప్యం నెలకొంది. రెండో దశ పూర్తిగా తగ్గే దశలో కూడా డయాబెటిస్‌, హైబీపీ, గుండెజబ్బులు తదితర సమస్యలు ఉన్న వారిని ఇబ్బంది పెట్టొచ్చు.

కొవిడ్‌ తర్వాత భారత్‌ ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

కరోనా ముగిసిపోయిందని ప్రభుత్వం, ప్రజలు ఎలా ప్రవర్తించారో మనం ఇప్పటికే చూశాం. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వైరస్‌ ఎక్కడికీ పోదు. ఇతర దేశాలు దీని నుంచి గుణపాఠాలు నేర్చుకున్నాయి. కానీ మన దగ్గర మాత్రం ఏం పొరపాటు జరిగిందన్న దానిపై ఎలాంటి విశ్లేషణ లేదు. మన ఆరోగ్యరంగంపై ఒత్తిడి ఎక్కువ. బెడ్‌లు, వైద్యులు, నర్సులు ఇలా అన్నీ అవసరమైన దానికంటే చాలా తక్కువే ఉన్నాయి. మొదటి దశలోనే వైద్యరంగం తీవ్ర ఒత్తిడికి లోనైంది. ప్రస్తుత పరిస్థితి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పబ్లిక్‌హెల్త్‌ డివిజన్‌ను ఏర్పాటు చేయాలి. దేశంలోని 718 జిల్లాల్లో ప్రజారోగ్యం కోసం ప్రత్యేక అధికారులను నియమించాలి. రెండోది మనకు యూనివర్సల్‌ హెల్త్‌కేర్‌ అవసరం. జీడీపీలో రెండు నుంచి మూడు శాతం పబ్లిక్‌ హెల్త్‌కు, మూడు నుంచి నాలుగు శాతం యూనివర్సల్‌ హెల్త్‌కేర్‌కు కేటాయించాలి.

మూడో వేవ్‌ను కచ్చితంగా అంచనా వేయడానికి శాస్త్రీయమైన ఆధారమేమీ లేదు. చర్చ మరో వేవ్‌ ఉంటుందా లేదా అన్నది కాదు, వైరస్‌ నిరంతరం విస్తరిస్తూనే ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలి. తీసుకోని వారందరూ ప్రమాదంలో ఉన్నట్లే.

ఇదీ చూడండి: నేషనల్ హెల్త్ అథారిటీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.