హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రత్యామ్నాయ వివాదాల పరిష్కార వేదిక ఐసీఏడీఆర్ ఆధ్వర్యంలో రెండో రోజు సదస్సు జరిగింది. వివాదాల పరిష్కార పద్ధతులు ఇటీవల వచ్చిన సవరణలపై సదస్సులో చర్చించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామసుబ్రమణ్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివాదాల పరిష్కారంలో, ఆర్బిటరేషన్, మీడియేషన్ పద్ధతులను ప్రచారం చేయడంలో ఐసీఏడీఆర్ (ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆల్ట్రనేటీవ్ డిస్ఫ్యూట్ రిసోల్యూషన్) సంస్థ చేస్తున్న కృషిని న్యాయమూర్తి ప్రశంసించారు. ఈ సదస్సుకు తెలంగాణ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ లిమిటెడ్, టీఎస్ఎన్పీడీసీఎల్ ఇంజినీర్లు, ట్రాన్స్కో మేనేజర్ మహిపాల్‌రెడ్డి హాజరయ్యారు.
ఇవీ చూడండి: 'వట్టెం ముంపు బాధితులకు న్యాయం చేయండి'