ETV Bharat / state

దళితబంధు అమలు కాకపోతే ఆత్మహత్య చేసుకుంటా: మోత్కుపల్లి

రాష్ట్రవ్యాప్తంగా దళిత బంధు అమలు కాకపోతే ఆత్మహత్య చేసుకుంటానని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు(Motkupalli Narasimhulu) తెలిపారు. అయితే నూటికి నూరు శాతం ఈ పథకాన్ని అమలుచేస్తారనే నమ్మకం కేసీఆర్​ మీద ఉందని స్పష్టం చేశారు.

Motkupalli Narasimhulu
Motkupalli Narasimhulu
author img

By

Published : Aug 29, 2021, 4:59 PM IST

రాష్ట్రంలో నూటికి నూరు శాతం దళితబంధు(dalit bandhu) పథకాన్ని అమలు చేస్తానని సీఎం కేసీఆర్‌ (cm kcr) హామీ ఇచ్చారని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు చెప్పారు. సీఎం కేసీఆర్‌ మాటల్లో నిజాయతీ కనిపించిందని చెప్పారు. ఒకవేళ దళితబంధు అమలు కాకపోతే యాదగిరిగుట్ట దగ్గర ఆత్మహత్య చేసుకుంటానని మోత్కుపల్లి తెలిపారు. ఇతర పార్టీలతో కలిసి దళితబంధుపై రేవంత్ రెడ్డి అనవసర రాజకీయం చేస్తున్నారని.. ఇందుకు నిరసనగా మోత్కుపల్లి నర్సింహులు బేగంపేటలోని తన నివాసంలో ఒకరోజు దీక్ష చేపట్టారు. ట్యాంక్‌బండ్‌ సమీపంలోని లిబర్టీ చౌరస్తాలో అంబేడ్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి దీక్షకు కూర్చున్నారు.

‘రాష్ట్రంలో దళితబంధు పథకం తీసుకురావడం ద్వారా గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని సరికొత్త ప్రయత్నాన్ని సీఎం కేసీఆర్ ప్రభుత్వం చేసింది. ఓ మహోన్నతమైన నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ హయాంలో ఎంతో మంది ముఖ్యమంత్రులుగా పని చేశారు. కానీ ఎవరూ దళితుల సంక్షేమం కోసం పాటుపడలేదు. దళితబంధు పథకం అమలుకు కాంగ్రెస్, భాజపా ఎందుకు అడ్డుపడుతున్నాయి. రేవంత్‌రెడ్డి తెదేపాను నిలువునా ముంచేశారు. రేవంత్ రెడ్డి వల్లే చంద్రబాబు నాశనం అయ్యారు. రేవంత్ రెడ్డిది శని పాదం’’అని మోత్కుపల్లి విమర్శించారు.

ఇదీచూడండి: CM KCR REVIEW: 'గట్టిగా పట్టుబడతా.. చివరి రక్తపుబొట్టు దాకా పోరాడుతా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.