ETV Bharat / state

స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకుల్లో హైదరాబాద్​కు 65వ స్థానం - స్వచ్ఛ సర్వేక్షణ్ 2020

స్వచ్ఛతలో హైదరాబాద్‌ నగరం వెనుకబడింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన స్వచ్ఛ సర్వేక్షణ్‌-2020 ర్యాంకుల్లో 65వ స్థానం దక్కించుకుంది. అయితే ముంబయి, బెంగళూరు, చెన్నై కంటే మెరుగ్గా రాణించింది.

Hyderabad ranks 65th in the Swachha Survekshan list
స్వచ్ఛ సర్వేక్షణ్‌ ర్యాంకుల్లో హైదరాబాద్​కు 65వ స్థానం
author img

By

Published : Aug 21, 2020, 10:29 AM IST

ఒక్కో మెట్టు ఎదుగుతూ..

దేశవ్యాప్తంగా 4,384 నగరాలు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో పాల్గొన్నాయి. అందులో మొత్తంగా వెనుకపడినా.. పది లక్షలకు పైగా జనాభా కలిగిన నగరాల ర్యాంకులతో పోలిస్తే హైదరాబాద్‌ మెరుగైన ర్యాంకు సాధించింది. ఏడాది పొడవునా నాలుగు త్రైమాసికాల్లో కేంద్ర బృందం నగరంలో పర్యటించి వేర్వేరు అంశాలను పరిశీలించింది. గత నాలుగేళ్ల నుంచి క్షేత్రస్థాయి పరిస్థితులను యంత్రాంగం చక్కదిద్దడంతో భాగ్యనగరం మొదటి నుంచి సర్వేలో ఒకస్థాయిలోనే కొనసాగుతోంది. స్వచ్ఛ ఆటోలు, ఇంటింటికి చెత్త డబ్బాల పంపిణీ, పొదుపు సంఘాల మహిళలతో అవగాహన కల్పించడం.. తడి, పొడి చెత్తను వేరు చేసేలా చైతన్యం, డంపింగ్‌ యార్డులో తడి చెత్తను ఎరువుగా మార్చడం, ప్రజా మరుగుదొడ్ల పరిశుభ్రత.. హోటళ్లు, పెట్రోలు బంకుల్లోని మరుగుదొడ్లను సాధారణ పౌరులు ఉపయోగించుకునేలా యాజమాన్యాలను ఒప్పించడం, చెత్త వాహనాలకు జీపీఎస్‌ పరికరాలు తదితర కార్యక్రమాలతో ముందుకు సాగుతోంది. సెప్టిక్‌ ట్యాంకుల వ్యర్థాలను నాలాలు, చెరువుల్లో పడేయకుండా జీహెచ్‌ఎంసీ, జలమండలి కలిసి శుద్ధి కేంద్రాలకు తరలిస్తున్నాయి. అందుకుగాను గత మూడేళ్లుగా కేంద్ర సర్కారు ఓడీఎఫ్‌++ ర్యాంకు అందజేస్తోంది.

వివరాలిలా..

‘సర్టిఫికేషన్‌’ నిరాశే

దేశవ్యాప్తంగా సర్టిఫికేషన్‌ గురించి జనవరిలో కేంద్ర ప్రభుత్వం సర్వే నిర్వహించి మార్కులు కేటాయించింది. బహిరంగ మల, మూత్ర విసర్జన విభాగంలో జీహెచ్‌ఎంసీకి ఓడీఎఫ్‌++ గుర్తింపు ఉండటంతో 500కు 500 మార్కులు దక్కాయి. చెత్త డబ్బాల విభాగం స్టార్‌ రేటింగ్‌కి కేటాయించిన 1000 మార్కుల్లో మాత్రం నగరం చతికిలబడింది. చాలా వీధుల్లో చెత్తడబ్బాలు దర్శనమిస్తుంటాయి. ఫలితంగా రెండు కేటగిరీలకు 1500కు గాను 500 మార్కులతో సరిపెట్టుకుంది.

ఇండోర్‌కు మొదటి స్థానం

ఇండోర్‌ నగర జనాభా సుమారు 31 లక్షలు. సర్వే మొదలైనప్పట్నుంచి అది మొదటి ర్యాంకును కైవసం చేసుకుంటోంది. ‘‘అక్కడి నగర పాలక సంస్థ ‘గార్బేజ్‌ ఫ్రీ’ నినాదంతో ఇళ్ల వ్యర్థాలను నేరుగా గమ్యానికి చేరుస్తోంది. దుమ్ము రహిత లక్ష్యం కోసం రహదారుల పొడవునా మట్టి కుప్పలు లేకుండా చర్యలు తీసుకున్నారు. నిర్మాణ వ్యర్థాలపై నిఘా పెట్టి భారీ జరిమానాలు విధించారు.

బుక్‌లెట్‌లో వినూత్నంగా..

‘‘స్వచ్ఛ భారత్‌ మిషన్‌ వినూత్న కార్యక్రమాల బుక్‌లెట్‌లో నగరానికి ప్రాముఖ్యం లభించింది. గచ్చిబౌలిలోని శునకాల ఉద్యాన వనాన్ని దేశంలోనే మొదటి ప్రత్యేక పార్కుగా గుర్తించింది. ఉద్యానవనం వెలుపల ప్లాస్టిక్‌ వ్యర్థాలతో తయారైన టైల్స్‌ను ఉపయోగించి కాలిబాటను నిర్మించడాన్నీ అభినందించింది. పేదల ఆకలి తీర్చేందుకు నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్రిడ్జ్‌లకూ ప్రాధాన్యం దక్కింది. ఈ కార్యక్రమాలకూ ప్రశంసలు దక్కాయని బల్దియా స్వచ్ఛభారత్‌ మిషన్‌ ప్రాజెక్టు అధికారి సోమ భరత్‌ తెలిపారు.

మెట్రో నగరాల్లో మెరుగైందిలా (ర్యాంకు)..

వివరాలిలా...
వివరాలిలా...

మనవాళ్లు.. 1,156 మార్కులు తెచ్చారు

10 లక్షల జనాభా పైబడిన నగరాల్లో మంచి పౌర స్పందన కలిగిన నగరంగా హైదరాబాద్‌ నిలిచింది. స్వచ్ఛ సర్వేక్షణ్‌ సర్వేలో నగరం పాల్గొంటున్న విషయం తెలుసుకుని లక్షలాదిమంది తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఆన్‌లైన్‌ సర్వేలో, ఫోన్‌ ద్వారా పాల్గొని 1,156.27 మార్కులు సాధించి పెట్టారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.