ETV Bharat / state

Artificial intelligence: చోరీ తీరును చెబితే.. దొంగెవరో చెప్పేస్తుంది! - దొంగలను గుర్తించడానికి కృత్రిమ మేధ

హైదరాబాద్ నగరంలో ఎక్కడ, ఎలాంటి నేరం జరిగినా వెంటనే ఆ ఘటనను విశ్లేషించి నేరస్థులెవరన్నది నిర్ధారించేందుకు పోలీస్‌ ఉన్నతాధికారులు కృత్రిమ మేధను వినియోగిస్తున్నారు. కమిషనరేట్‌ కార్యాలయంలో పనిచేస్తున్న ఐటీసెల్‌ను ప్రతి ఠాణలోనూ ఏర్పాటు చేయనున్నారు. అందుకోసం కానిస్టేబుల్‌ నుంచి ఇన్‌స్పెక్టర్ల వరకు శిక్షణ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇళ్లల్లో దొంగతనాలు, దోపిడీలు, దుకాణాలు, షాపింగ్‌మాల్స్‌లో నమోదవుతున్న నేరాలను నియంత్రించడం ద్వారా బాధితులకు సాంత్వన లభించనుందని పోలీస్‌ అధికారులు తెలిపారు.

Artificial intelligence
కృత్రిమ మేధ
author img

By

Published : Aug 13, 2021, 12:30 PM IST

చాంద్రాయణగుట్ట ఠాణా పరిధిలో నెల క్రితం ఓ ఇంట్లో దొంగతనం జరిగింది... సొత్తూ, సొమ్మూ కలిసి రూ.3 లక్షలు దొంగ ఎత్తుకెళ్లాడు... చోరీకి పాల్పడింది ఎవరన్నది మిస్టరీగా మారింది. ఆ లోపు బోనాల వేడుకలతో పోలీసులు వాటికి ప్రాధాన్యం ఇచ్చారు. బాధితుడు పోలీసుల వద్దకు వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. దక్షిణమండలం టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రాఘవేంద్ర ఘటనా స్థలానికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. కార్యాలయానికి వచ్చి తనకు తెలిసిన విషయాలను కంప్యూటర్‌తో పంచుకున్నాడు. క్షణాల వ్యవధిలో ముగ్గురు పేర్లను చెప్పింది.. ఆ సమాచారం ఆధారంగా సలీం అలియాస్‌ సునీల్‌ షెట్టి అనే పాత నేరస్థుడిని అరెస్ట్‌ చేశారు. ఒక్క ఆధారంతో సలీం చేసిన 12 చోరీలు బయటపడ్డాయి.’’

- నేర నియంత్రణకు హైదరాబాద్‌ పోలీసులు వినియోగిస్తున్న కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) ఉపయోగమిది...

నిరంతర విశ్లేషణ... క్షణాల్లో సమాచారం

నేరాలను నియంత్రించేందుకు న్యూయార్క్‌ పోలీసులు రెండు దశాబ్దాల నుంచి కృత్రిమమేధను వినియోగిస్తున్నారు. నేరస్థుల తాజా సమాచారం, వారి ఫొటోలు, చిరునామాలు, నేరశైలి ఇలా అన్నింటిని ఓ సాఫ్ట్‌వేర్‌లో పోలీస్‌ అధికారులు నమోదు చేస్తున్నారు. నేరం జరిగిన వెంటనే ఆ సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేస్తే వెంటనే కంప్యూటర్‌ ఆ నేరానికి సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. రాజధాని నగరంలో ఇళ్లలో దొంగతనాలు, ద్విచక్రవాహనాల చోరీలు, దారిదోపిడీలు ప్రజలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. సీసీ కెమెరాలున్నాయని దొంగలకు తెలిసిపోవడంతో నేరస్థులు పక్కాగా జాగ్రత్తలు తీసుకుని మరీ చోరీ చేస్తున్నారు. పండుగలు, పెళ్లిళ్లు, ఇతర సందర్భాల్లో బంగారు ఆభరణాలు, నగదు జాగ్రత్తగా దాచుకున్నప్పుడు దొంగలు రెచ్చిపోయి రాత్రివేళల్లో సొత్తూ, నగదు అపహరిస్తున్నారు. ఇలా ఏటా 2500 కేసులు నమోదవుతుండగా... సగం మంది నిందితులను మాత్రమే పట్టుకోగలుగుతున్నారు.

జైల్లో ఉంటే సరే.. లేదంటే పరిశోధన

పోలీస్‌ కమిషనరేట్‌లోని ఐటీసెల్‌కు దొంగతనాలు, నేరాలకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత ఠాణా అధికారులు పంపించిన వెంటనే కృత్రిమమేధ అత్యంత వేగంగా నేరం తీరును విశ్లేషిస్తుంది. ఆధారాలు దొరక్కుండా చోరీలకు పాల్పడుతున్న మంత్రి శంకర్‌ను ఇలాగే పట్టించి ఇచ్చింది.

  • పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లేలోపు సమాచారమంతా సంబంధిత ఠాణాకు, పోలీస్‌ అధికారి చరవాణికి సమాచారం చేరుతుంది. దీని ఆధారంగా పోలీస్‌ అధికారి దర్యాప్తు వేగంగా పూర్తిచేసేందుకు వీలుంటుంది.
  • దొంగతనం, హత్య, స్నాచింగ్‌ ఇలా ఏ నేరం జరిగినా కృత్రిమ మేధస్సు వెంటనే ఈ ఘటనను విశ్లేషిస్తుంది. గొలుసు దొంగతనం చోటుచేసుకుంటే స్నాచర్లు ఎంతమంది ఉన్నారు? వీరిలో జైల్లో ఉన్నవారెంతమంది? జైలు నుంచి విడుదలైన వారు ఎక్కడున్నారు? అని విశ్లేషిస్తుంది. ఆ ప్రాంతంలో గతంలో ఎన్ని స్నాచింగ్‌ ఘటనలు జరిగాయో వివరిస్తుంది. పాత నేరస్థులు, స్నాచర్లకు తాజా దొంగతనంతో సంబంధం లేకపోతే కొత్తవారు ఈ పనిచేశారంటూ తెలుపుతుంది.
  • కృత్రిమ మేధస్సుకు ఐటీ సెల్‌ అధికారులు ఎప్పటికప్పుడు సీసీ కెమెరాల ఫుటేజీల్లోని దృశ్యాల సమాచారం, జైలు నుంచి విడుదలైన ఖైదీల వివరాలు, కొత్త ప్రాంతాల్లో జరిగిన నేర ఘటనలను అప్‌లోడ్‌ చేస్తుంటారు.

ఇదీ చూడండి: రాజకీయాలు ప్చ్‌... కృత్రిమ మేధ మస్త్‌!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.