ETV Bharat / state

కరోనాపై పోరులో ద్విముఖ వ్యూహంతో పోలీస్ శాఖ - వాహనాల అదుపునకు పోలీసుల వ్యూహం

కరోనా కంటికి కనిపించని శత్రువు. ప్రస్తుతం ఇది ప్రభుత్వాలకు పెనుసవాలు విసురుతోంది. ఈ బృహత్‌ ప్రయత్నంలో పోలీస్​ శాఖ కీలక పాత్ర పోషిస్తోంది. ద్విముఖ వ్యుహంతో ముందుకుసాగుతోంది. రాత్రి, పగలు తేడా లేకుండా క్షేత్రస్థాయిలో లాక్‌డౌన్‌ అమలుకు చర్యలు తీసుకుంటోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తెరవెనుక పెద్ద తతంగమే నడిపిస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నిందితులను పట్టుకునేందుకు, ట్రాఫిక్‌ నియంత్రణకు విరివిగా వాడుతున్న సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు కరోనా మహమ్మారి కోరలు చాస్తున్న వేళ తెలంగాణ పోలీసు శాఖ వినియోగించుకుంటోంది.

Hyderabad police
ద్విముఖ వ్యూహంతో పోలీస్ శాఖ
author img

By

Published : Apr 22, 2020, 9:29 PM IST

కరోనా అనుమానితులు స్వీయ నిర్భందంలో ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఒక దశలో రాష్ట్రంలో దాదాపు 26 వేల మందికిపైగా స్వీయ నిర్భందంలో ఉన్నారు. వీరందరి కదలికలను నిరంతరం గమనించడం సాధ్యం కాదు. అందుకే అందరిని జియో ట్యాగింగ్‌ చేశారు. సెల్‌ఫోన్లను కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేశారు. వారు స్వీయ నిర్భంధంలో ఉన్న ప్రదేశాన్ని జోడించారు. అక్కడి నుంచి 50 మీటర్ల దూరం జరిగితే కంట్రోల్‌రూంలో ఉన్న సిబ్బంది అప్రమత్తమయ్యేలా చేశారు.

అత్యాధునిక కెమెరాలు..

శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా హైదరాబాద్‌ నగరంలో 350 అత్యాధునిక కెమోరాలు ఏర్పాటు చేశారు. వీటిని కంట్రోల్‌రూమ్‌కు అనుసంధానం చేశారు. ఏదైనా అవాంఛనీయ ఘటన చోటు చేసుకున్నప్పుడు ఎక్కడెక్కడ ఎక్కువ మంది గుమిగూడారో తెలుసుకొని సమీపంలో ఉన్న సిబ్బందిని అప్రమత్తం చేస్తారు. ఇందుకు కృత్రిమ మేధస్సు వాడుతున్నారు. జనం గుమిగూడిన ప్రాంతాలనున పసిగట్టి.. ఏ రహదారి గుండా ఎక్కువ వాహనాలు ప్రయాణిస్తున్నాయో కెమోరాలే వాటంతట అవి గుర్తించేలా కొన్ని మార్పులు చేశారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే కేసే...

నిత్యావసరాల కోసం వచ్చేవారు మూడు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించకూడదనేది నిబంధన. దీన్ని రెండు రకాలుగా పర్యవేక్షిస్తున్నారు. ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ రికగ్నైజేషన్‌ విధానం. రోడ్డుపై ప్రయాణిస్తున్న వాహనాల నెంబర్‌ ప్లేట్‌ను బట్టి రోడ్డు రవాణా శాఖలోని డేటాబేస్‌ ఆధారంగా యజమాని చిరునామాను క్షణాల్లో పోలీసులకు అందిస్తుంది. ఏ సమయంలో ఏ రహదారి వెంట వాహనం ప్రయాణించిందన్న వివరాలన్నీ ఈ కెమోరాలు నమోదు చేసి కావాల్సిన సమాచారాన్ని కంప్యూటర్‌ తెరపై చూపిస్తాయి. ఏదైనా వాహనం రోడ్డెక్కగానే దాని నెంబర్‌ ఆధారంగా ఏఎన్‌పీఆర్‌ కెమోరాలు చిరునామాను వెలికితీస్తాయి. ఆ చిరునామా ఉన్న ప్రాంతం కంటే మూడు కిలోమీటర్ల ఎక్కువ దూరం వాహనం ప్రయాణించిన పక్షంలో కంట్రోల్‌రూంలో సిబ్బందిని కంప్యూటర్‌ అప్రమత్తం చేస్తోంది. తద్వారా కేసు నమోదు చేస్తున్నారు.

1.20 లక్షలకు పైగా వాహనాలు స్వాధీనం...

ప్రత్యేకంగా ఓ యాప్‌ అభివృద్ధి చేసి క్షేత్రస్థాయి సిబ్బంది ఫోన్లలో నిక్షిప్తం చేశారు. ఏదైనా వాహనం రోడ్డుమీదకు రాగానే అందులో వివరాలు నమోదు చేస్తారు. చెక్‌పోస్టులో ఉన్న సిబ్బంది కూడా వివరాలు నమోదు చేస్తారు. ఈ సాంకేతిక పరిజ్ఞానం దన్నుతోనే ఇప్పటివరకు రాష్ట్రంలో 1.20 లక్షలకు పైగా వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కంటైన్మెంట్ ప్రాంతాల్లో ప్రజలను నియంత్రించడానికి రాష్ట్రవ్యాప్తంగా డ్రోన్లను వినియోగిస్తున్నారు.

కొత్త యాప్...

ఎవరికైనా కరోనా ఉన్నట్లు నిర్ధరణ కాగానే వారి ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా ఎక్కడెక్కడ తిరిగారు. ఎవరెవర్ని కలిశారు? తదితర వివరాలను నిమిషాల్లో సేకరించి వారందర్నీ క్వారంటైన్ చేయడంలో పోలీసులు కీలకపాత్ర పోషిస్తున్నారు. కరోనా రోగులు, అనుమానితులను పర్యవేక్షించడానికి కొత్త యాప్‌ రూపొందిస్తున్నామని, గూగుల్‌ ప్లేస్టోర్‌ అనుమతి రాగానే అందుబాటులోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు.

ఇవీ చూడండి: 24 గంటల్లో 1,383 కొత్త కేసులు- 50మరణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.