కరోనా కట్టడికి పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నా... కొందరు వాహనదారులు ఉదయం 10 గంటల తరువాత కూడా రోడ్లపై తిరుగుతుండటంతో పోలీసులు చర్యలకు సిద్ధమయ్యారు. ఇప్పటివరకు కేవలం కేసులతో సరిపెట్టిన పోలీసులు ఇక నుంచి వాహనాలను సీజ్ చేస్తున్నారు. హైదరాబాద్ షాపూర్ నగర్ చెక్ పోస్టు వద్ద పోలీసుల తనిఖీల్లో అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారి వాహనాలపై కేసులు నమోదు చేసి సీజ్ చేశారు.
బాలానగర్ జోన్లోని తొమ్మిది పోలీస్ స్టేషన్ల పరిధిల్లో ఈనెల 12 నుంచి 20 వరకు సుమారు 5 వేలకు పైగా కేసులు నమోదు చేసినట్లు డీసీపీ పద్మజ తెలిపారు. ఇక నుంచి వాహనాలను సీజ్ చేస్తామని, ఉదయం 10 గంటల తరువాత అనవసరంగా రోడ్లపైకి వస్తున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: స్నేహితుడికి ఇచ్చిన మాట కోసం.. పొగాకు వ్యతిరేక ఉద్యమం