దేశ రాజధాని దిల్లీలో జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో భాగ్య నగర పోలీసులు అనధికారికంగా హై అలర్ట్ ప్రకటించారు. నగరంలోని పాతబస్తీలో అతి సున్నితమైన ప్రాంతాలను గుర్తించి మీర్ చౌక్ ఏసీపీ ఆనంద్ అంధ్వర్యంలో సౌత్ జోన్ పోలీసులు, సీఆర్పీఎఫ్ జవాన్లతో కవాతు నిర్వహించారు.
సామాన్య ప్రజలకు ఇబ్బంది కలుగకుండా పికటింగ్లు నిర్వహిస్తోన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: ఇష్టారాజ్యంగా ఫీజులు.. స్పందించని విద్యాశాఖ!