Kokapet Sewage Water Treatment Plant Inauguration : జలమండలి నూతనంగా నిర్మించిన కోకాపేట మురుగు నీటి శుద్ధి కేంద్రాన్ని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ఇవాళ ప్రారంభించనున్నారు. కోకాపేట ఎస్టీపీని ప్యాకేజీ-2లో భాగంగా.. 15 ఎంఎల్డీల సామర్థ్యం, ఆధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ (ఎస్బీఆర్) టెక్నాలజీతో నిర్మించారు. ఈ టెక్నాలజీ ఉపయోగించడంతో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ నీటిని మురుగు శుద్ధి చేయవచ్చని అధికారులు వెల్లడించారు.
విద్యుత్తు వినియోగం సైతం తక్కువగా ఉంటుంది. ఈ ఎస్టీపీ అందుబాటులోకి వస్తే.. వట్టినాగుల పల్లి, తాజ్‌నగర్, జర్నలిస్టు కాలనీ, గౌలి దొడ్డి, ఐఎస్బీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, విప్రో, మైక్రోసాఫ్ట్ సాఫ్ట్ వేర్ కంపెనీలు ఉన్న ప్రాంతాల నుంచి ఉత్పన్నమయ్యే మురుగు నీటిని శుద్ధి చేయవచ్చు. దీని నిర్మాణానికి మొత్తం రూ.66.16 కోట్లు ఖర్చయ్యాయి. హైదరాబాద్ మహా నగరంలో వంద శాతం మురుగు నీటి శుద్ధి లక్ష్యంగా ప్రభుత్వం 3ప్యాకేజీల్లో రూ.3866.41 కోట్ల వ్యయంతో నూతన 31 ఎస్టీపీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
- Vechicles Speed In crease On ORR : ఓఆర్ఆర్‌పై 100 కాదంట.. ఇక నుంచి 120KMPH వెళ్లొచ్చు
- Uppal Skywalk Inauguration : భాగ్యనగరం సిగలో మరో మణిహారం.. నేడే ఉప్పల్ స్కైవాక్ ప్రారంభం
హైదరాబాద్ అర్బన్ ఆగ్లోమెరేషన్ పరిధిలో ప్రస్తుతం రోజూ 1950 మిలియన్ గ్యాలన్ల మురుగు నీరు ఉత్పత్తి అవుతోంది. ఇందులో జీహెచ్ఎంసీ ప్రాంతంలో 1650 మిలియన్ గ్యాలన్లు ఉత్పత్తి అవుతుంది. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం ఉన్న25 సీవరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ల ద్వారా 772 మిలియన్ గ్యాలన్లు మురుగునీటిని శుద్ధి చేస్తున్నారు. మిగతా 878 మిలియన్ గ్యాలన్ల మురుగు నీటిని శుభ్రం చేయడం కోసం ప్రభుత్వం మొదటి దశలో కొత్తగా 31ఎస్టీపీల నిర్మాణాలను చేపట్టింది.
Narsingi Outer Ring Road Interchange : 2036 సంవత్సరం వరకు రాబోయే కాలంలో ఉత్పత్తయ్యే మురుగును శుద్ధి చేసేందుకు నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే.. రోజూ ఉత్పన్నమయ్యే మురుగును 100 శాతం శుద్ధి చేసే తొలి నగరంగా దక్షిణాసియాలోనే హైదరాబాద్ నిలవనుంది. ఇక దీంతోపాటు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పైన మరొక ఇంటర్ చేంజ్ అందుబాటులోకి రానుంది. నార్సింగి వద్ద రూ.29.50 కోట్ల వ్యయంతో నిర్మించిన ఇంటర్ చేంజ్‌ను ఇవాళ ఉదయం 10గంటలకు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.
నార్సింగి ఇంటర్ చేంజ్ నిర్మాణంతో నార్సింగి, మంచిరేవుల, గండిపేట్ ప్రాంతాల ప్రయాణికులతో పాటు లంగర్ హౌస్, శంకర్ పల్లి ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు ఓఆర్ఆర్ మీదుగా వారి గమ్యస్థానానికి చేరుకోవడానికి ఎంతో సులువు కానుంది. మరోవైపు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ను నియంత్రణతోపాటు పాదచారులకు ఉపయోగపడేలా ఉప్పల్ స్కై వాక్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే.
ఇవీ చదవండి: