Hyderabad Outer Ring Rail Project : గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ రీజినల్ రింగ్ రోడ్‌కు కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో భూసేకరణ జరుగుతోంది. ఓవైపు ఈ ప్రాజెక్టు కొనసాగుతుండగానే.. మరో భారీ ప్రాజెక్టు సర్వేకు కేంద్ర సర్కార్ పచ్చజెండా ఊపినట్లు రైల్వేశాఖ వెల్లడించింది. ఔటర్ రింగ్ రైల్ కోసం ఫైనల్ లొకేషన్ సర్వే(ఎఫ్ఎల్ఎస్)కు రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి ఆమోదం లభించినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
Telangana Regional Ring Road : తెలంగాణ ఆర్ఆర్ఆర్ భూసేకరణకు కసరత్తు షురూ
ఈ మేరకు సర్వేను వీలైనంత త్వరగా చేపట్టనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. సుమారు 564 కిలోమీటర్ల పరిధిలో రూ.12 వేల 408 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. రీజినల్ రింగ్ రోడ్ కోసం సేకరించిన భూసేకరణ ప్రాంతంలోనే ఈ ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నారు. రీజినల్ రింగ్ రోడ్ అభివృద్ది చెందే ప్రాంతంలో టౌన్‌షిప్‌లు, ఇండస్ట్రియల్ జోన్‌లకు ఈ ప్రాజెక్టు కీలకంగా మారనుంది.
Hyderabad Regional Ringroad Project : ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టు ఏయే ప్రాంతాల మీదుగా వెళ్లనుందో రైల్వే శాఖ అధికారులు సూచనప్రాయంగా వెల్లడించారు. అక్కన్నపేట్, భువనగిరి, యాదగిరిగుట్ట, చిట్యాల, బూర్గుల, వికారాబాద్, గేట్ వనంపల్లి, మెదక్, సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాల మీదుగా వెళ్లనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు వికారాబాద్, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, యాదాద్రి భువనగిరి, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలను కలుపుతూ వెళ్లనుంది.
వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, అక్కన్నపేట్, సిద్దిపేట్, గజ్వేల్, భువనగిరి, యాదగిరిగుట్ట, రామన్నపేట, చిట్యాల, నారాయణపూర్, షాద్‌నగర్, షాబాద్ వంటి పట్టణాలను సైతం కలుపుతూ వెళుతుందని రైల్వే శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఎఫ్‌ఎల్‌ఎస్‌కు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలపడంతో వీలైనంత త్వరగా సర్వే చేపట్టనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే.. హైదరాబాద్-సికింద్రాబాద్-కాచిగూడ రీజియన్‌లో మరింత వేగంగా సరకు రవాణా చేసేందుకు అవకాశం ఉంటుందని రైల్వే శాఖ భావిస్తోంది. ఔటర్ రింగ్ రైల్‌ను బైపాస్ కారిడార్‌గా వినియోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు. రీజినల్ రింగ్ రోడ్డు, రింగ్ రైల్‌తో హైదరాబాద్ రూపురేఖలు మారిపోనున్నాయని పేర్కొంటున్నారు.
"హైదరాబాద్ రింగ్ రైల్ గేమ్ ఛేంజర్‌గా మారనుంది. ఇప్పటికే కేంద్రప్రభుత్వం నిర్మాణం తలపెట్టిన రీజినల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా.. రింగ్ రైల్ రాబోతుంది. దీని వల్ల సరకు రవాణాలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. రింగ్ రైల్.. ఫైనల్ లొకేషన్ సర్వేకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది". - కిషన్‌రెడ్డి, కేంద్రమంత్రి
Telangana Regional Ring Road : భారత్‌మాల-2 ప్రాజెక్టులో తెలంగాణ ఆర్ఆర్ఆర్