ETV Bharat / state

జల్సాలకు అలవాటు పడి చైన్​ స్నాచింగ్​లు - హైదరాబాద్​ నేర వార్తలు

జల్సాలకు అలవాటు పడి విలాసవంతమైన జీవితం గడపాలనే ఉద్దేశంతో చైన్​ స్నాచింగ్​లకు పాల్పడుతున్న ఇద్దరు నేరస్థులను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. నిందితుల నుంచి ఓ ద్విచక్రవాహనం, 45 గ్రాముల మంగళసూత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

Hyderabad old city Chain Snatchers Arrested by south zone polices
జల్సాలకు అలవాటు పడి చైన్​ స్నాచింగ్​లు
author img

By

Published : Jun 6, 2020, 5:37 PM IST

హైదరాబాద్ పాతబస్తీకి చెందిన​ మహమ్మద్​ అంజద్​, మహమ్మద్​ షోయబ్​ అనే ఇద్దరు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. మద్యం, గంజాయికి అలవాటు పడి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో చైన్​ స్నాచింగ్​లు​ చేయటం మొదలుపెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. గతనెల 30న అబిడ్స్​ వద్ద మహిళ మెడలో నుంచి మంగళసూత్రం స్నాచింగ్​ చేసి పరారైనట్లు వెల్లడించారు.

బాలాపూర్​లో కూడా ఇదే తరహాలో స్నాచింగ్​కి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజీలను పరిశీలించిన అనంతరం వీరిద్దరిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. వారి నుంచి ఓ ద్విచ్రవాహనం, 45 గ్రాముల మంగళసూత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను రిమాండ్​కు తరలించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.