రేపు, ఎల్లుండి అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉత్తర కోస్తా కర్ణాటక నుంచి మరఠ్వాడ వరకు ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, మధ్య మహారాష్ట్ర మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతుందని వెల్లడించింది.
సోమవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, వడగండ్లు, ఈదురు గాలులతో గంటకు 30 నుంచి 40 కేఎంపీహెచ్ వేగంతో ఆదిలాబాద్, కుమురంభీం -ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, జనగామ, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్-(పట్టణ, గ్రామీణ), మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్రం సంచాలకులు వివరించారు.
ఇదీ చూడండి: పోలీసులను చూసి భయమేసింది... కొత్తిమీర రోడ్డు పాలైంది