ETV Bharat / state

సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ పరిధిలో మేయర్​ పరిశీలన - మేయర్​ బొంతు రామ్మోహన్​ తాజా వార్తలు

సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ ఎదుటున్న జంక్షన్​ను జీహెచ్​ఎంసీ, ఆర్టీసీ, ట్రాఫిక్​ పోలీస్​ అధికారులతో కలిసి మేయర్​ బొంతు రామ్మోహన్​ పరిశీలించారు. స్టేషన్​కు వచ్చే వాహనాలకు, ప్రత్యేక లైన్​ల ఏర్పాటు, సాధారణ వాహనాలను రీ రూటింగ్ చేయడం వంటి విషయాలపై ఆరా తీశారు.

సికింద్రాబాద్​ రైల్వే స్టేషన్​ పరిధిలో మేయర్​ పరిశీలన

author img

By

Published : May 18, 2020, 1:10 PM IST

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదుట ఉన్న జంక్షన్​ను హైదరాబాద్​ మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు. జీహెచ్ఎంసీ, ఆర్టీసీ, ట్రాఫిక్ పోలీస్ అధికారులతో కలిసి జంక్షన్ అభివృద్ధికి, ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై పర్యవేక్షించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిత్యం వచ్చి పోయే ప్రయాణికులకు తగిన వసతులు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, జంక్షన్ అభివృద్ధి, వంటి విషయాల పై వివిధ విభాగాల అధికారులతో చర్చించారు.

స్టేషన్​కు వచ్చే వాహనాలకు, ప్రత్యేక లైన్​ల ఏర్పాటు, సాధారణ వాహనాలను రీ రూటింగ్ చేయడం వంటి విషయాలపై రామ్మోహన్​ ఆరా తీశారు. అలాగే సెంట్రల్ మిడియన్లు, బస్ షెల్టర్ల ఆధునీకరణ, అధునాతన మరుగుదొడ్లు, షీ టాయిలెట్స్ ఏర్పాటు, ప్రయాణికులకు రక్షణ ఇచ్చేలా షెడ్​ల ఏర్పాటుపై పరిశీలించారు.

ఇవీ చూడండి: కూలీ బతుకు.. అందని మెతుకు !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.