ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటేనే సీజనల్ వ్యాధులు దరిచేరవని హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. అంబర్పేట అలీ కేఫ్ చౌరస్తాలో గురువారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, అధికారులు పాల్గొన్నారు. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, నీటి నిల్వ డ్రమ్ములు, కూలర్లో వారంలో ఒకసారి పూర్తిగా... నీళ్లు తీసేసి శుభ్రం చేసుకొని వాడుకోవాలని సూచించారు. తద్వారా దోమల నివారణకు సాధ్యమవుతుందన్నారు.
అదేవిధంగా మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా , ఫైలేరియా, మెదడువాపు తదితర సీజనల్ వ్యాధుల నివారణ కోసం ఇప్పటి నుంచే ప్రజలందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని రామ్మోహన్ కోరారు. రాబోయే వర్షా కాలంలో ఎలాంటి రోగాలు రాకూడదంటే ఇప్పటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
"ఇంట్లో చెత్తను మోరీల్లో వేయకూడదు. ఇంటి ముందుకొచ్చే మున్సిపల్ చెత్త బండికి అందజేయాలి. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులను గౌరవించడం మన బాధ్యత. శానిటేషన్ విషయంలో రాష్ట్రానికి మంచి పేరు వచ్చింది. ఆ పేరును మనం కాపాడుకోవాలి."
-బొంతు రామ్మోహన్, మేయర్
ఇదీ చూడండి: మనిషిని నమ్మడమే అది చేసిన తప్పు