ETV Bharat / state

'హైదరాబాద్‌ను ఆహ్లాదకర నగరంగా అభివృద్ధి చేస్తున్నాం' - మేయర్ బొంతు రామ్మోహన్ వార్తలు

గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రతి కాలనీలో ఆహ్లాదకర వాతావరణాన్ని పెంపొందించుటకు 320 పార్కులను అభివృద్ధి చేస్తున్నామని మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ఆకాంక్షలకు అనుగుణంగా మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో భాగ్యనగరాన్ని హరితనగరంగా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. ఐఎస్‌ సదన్ మోహన్ నగర్ కాలనీలో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన పార్కును మేయర్ ప్రారంభించారు.

hyderabad mayor
hyderabad mayor
author img

By

Published : Aug 24, 2020, 5:00 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆకాంక్షలకు అనుగుణంగా పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో హైదరాబాద్‌ను హరితనగరంగా తీర్చిదిద్దుతున్నట్లు మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ తెలిపారు. ఐఎస్‌ సదన్ మోహన్ నగర్ కాలనీలో జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన పార్కును ప్రారంభించారు. కొద్దిపాటి విస్తీర్ణం ఉన్నప్పటికీ వాకింగ్ ట్రాక్‌, ఓపెన్ జిమ్‌, చిన్నపిల్లల ఆట వ‌స్తువులు, వృద్ధులు, మ‌హిళ‌లకు ఉప‌యోగ‌ప‌డే విధంగా ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణాన్ని క‌ల్పిస్తున్నట్లు మేయర్ వివరించారు.

hyderabad mayor
'హైదరాబాద్‌ను ఆహ్లాదకరమైన నగరంగా అభివృద్ధి చేస్తున్నాం'

కార్పొరేటర్ల సహకారంతో పార్కుల్లో వసతులు కల్పించి, ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. అన్ని వయసుల ప్రజలకు ఉపయోగపడే విధంగా పార్కుల్లో వాకింగ్ ట్రాక్‌లతో పాటు, జిమ్‌లు, ఇతర వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. 50 థీమ్ పార్కులను, 120 జంక్షన్‌లను అభివృద్ధి చేస్తున్నట్లు మేయ‌ర్ తెలిపారు.

రోడ్లపై ఎక్కడ‌ప‌డితే అక్కడ చెత్త వేస్తున్నవారిని గుర్తించాల‌ని పారిశుద్ధ్య కార్మికులకు సూచించారు. అలాంటి వ్యక్తుల‌కు పారిశుద్ధ్యంపై అవ‌గాహ‌న క‌ల్పించాల‌న్నారు. జీహెచ్ఎంసీ ఇచ్చిన యూనిఫామ్‌ను విధుల్లో ఉన్న స‌మ‌యంలో త‌ప్పనిస‌రిగా ధ‌రించాల‌ని స్పష్టం చేశారు. ఈ ప‌ర్యట‌న‌లో స్టాండింగ్ కమిటీ సభ్యురాలు సామ స్వప్న సుందర్ రెడ్డి, జోన‌ల్ క‌మిష‌న‌ర్ అశోక్ సామ్రాట్‌, డిప్యూటీ క‌మిష‌న‌ర్ మంగ‌తాయారు త‌దిత‌రులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.