హైదరాబాద్ ఈవెంట్స్‌లో ఎంతో ప్రత్యేకమైన హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్ ఈ సారి వర్చువల్‌గా జరగనుంది. ఏటా జనవరిలో నిర్వహించే లిటరరీ ఫెస్టివల్‌ను వర్చువల్‌గా నిర్వహించనున్నట్లు పరిశ్రమలు, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఇలా చేయక తప్పటం లేదని డైరెక్టర్లు అభిప్రాయపడ్డారు.
ప్రముఖ కవి గుల్జార్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న ఈ ఫెస్టివల్ ఈనెల 22 నుంచి 24 వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్నట్లు జయేష్ రంజన్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా కవి సమ్మేళనం, స్థానిక ఆర్టిస్ట్‌లను భాగస్వాములను చేసేలా యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌తో కలిసి ఆర్ట్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తామని లిటరరీ ఫెస్టివల్ డైరెక్టర్ తెలిపారు.
ఇదీ చదవండి: కొత్త కొత్తగా ఇడ్లీ వడ్డించండి!