హైదరాబాద్ శివారు జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ తెల్లవారుజామున కార్తికేయ రసాయనిక పరిశ్రమలో ఒక్కసారిగా అగ్నికీలలు ఎగిరిపడి మంటలు వ్యాపించడంతో కార్మికులు భయంతో పరుగులుతీశారు. సంస్థ ప్రతినిధులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన నాలుగు అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. గంటపాటు శ్రమించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో సిబ్బంది, స్థానికులు ఊరిపి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని తెలుస్తోంది.
ఇదీ చూడండి: పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్ రెడ్డికి రోడ్డు ప్రమాదం