Hyderabad Ganja Gang Arrested : కుటుంబం మొత్తం కలిసి పని చేస్తారు.. నెలకు రూ.లక్షల్లో సంపాదిస్తారు. భారీగా స్థిర, చరాస్తులను కూడబెట్టుకున్నారు. ధూల్‌పేటతో పాటు నానక్‌రామ్‌గూడలో రెండు ఇళ్లు కట్టుకున్నారు కానీ.. పోలీసులు వారిని అరెస్ట్ చేసిన కటకటాల్లోకి నెట్టారు. అదేంటి అనుకుంటున్నారా? ..... అవును నిజమే ఇందతా గంజాయి విక్రయించి సంపాదించిన సొమ్ము. నానక్‌రామ్‌గూడ అడ్డాగా సాగుతున్న మత్తుదందాను టీఎస్‌న్యాబ్, గోల్కొండ పోలీసులు బట్టబయలు చేశారు. గంజాయి వ్యాపారంతో కూడబెట్టిన రూ.4కోట్ల విలువైన ఆస్తులను సీజ్ చేశారు.
Ganja Supply in Hyderabad : గంజాయి సరఫరా వ్యవహారంలో దూల్‌పేట్‌పై పోలీసుల నిఘా పెరగటంతో మాదకద్రవ్యాలు విక్రయించే కుటుంబాలు నగరమ శివారు ప్రాంతాలకు మకాం మార్చాయి. అదే ప్రాంతానికి తల్లీకొడుకులు, మరో మహిళ సహా మైనర్ బాలుడు నానక్‌రామ్‌గూడ చేరారు. అక్కడ మూడు కిరాణా దుకాణాలు ప్రారంభించారు. చుట్టుపక్కల వారికి నిత్యావసర సరుకులు విక్రయిస్తున్నట్టుగా నమ్మించి దూల్‌పేట్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా నుంచి దిగుమతి చేసుకున్న గంజాయిని విక్రయిస్తున్నారు. దుకాణాల్లోకి బయటి వ్యక్తులు రాకుండా ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేశారు.
పోలీసులు అనుమానించకుండా పిల్లలతో చీకటి వ్యాపారం సాగిస్తున్నారని నార్కొటిక్ బ్యూరో ఎస్పీ వెల్లడించారు. ఆ ప్రాంతంలో కొత్త వ్యక్తులు ప్రవేశించినా.. పోలీసులు తనిఖీలు చేపట్టినా ముందుగానే తెలుసుకొనేందుకు నానక్‌రామ్‌గూడ లోధాబస్తీ ప్రధాన మార్గంలో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేశారన్నారు. కెమెరాల ద్వారా దృశ్యాలు రికార్డు కాకుండా కేవలం వీక్షించేందుకు అనువుగా తయారు చేసుకున్నారని తెలిపారు.
Ganja gang arrested in Cyberabad : సైబరాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత.. విలువ ఎంతంటే?
వీరి వద్ద గంజాయి కొనుగోలు చేసేందుకు మహానగరం చుట్టుపక్కల నుంచి వందలాది మంది వచ్చిపోతున్నారు. వీరిలో విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు, వైద్యులు ఉంటున్నారు. మూడు దుకాణాల్లో కలిపి ప్రతిరోజూ 30వేల వ్యాపారం జరుగుతున్నట్టు పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. అక్కడకు వచ్చే కొనుగోలుదారులను తమదైన శైలిలో ప్రశ్నించటంతో గంజాయి రాకెట్ వెలుగుచూసింది. గోల్కోండ పోలీసుల సాయంతో దుకాణాలపై దాడులు నిర్వహించి గౌతమ్‌సింగ్, నీతూబాయి, మదుబాయిలను అరెస్ట్ చేశారు. బాలుడిని జువెనైల్ హోంకు తరలించారు.
"నానక్రామ్గుడాలో కిరాణ షాప్ పెట్టి అక్కడికి వచ్చే వారికి గంజా అమ్ముతున్నారని అక్కడ చుట్టుపక్కల ఉంటున్నవారందరికి తెలుసు. వచ్చిన వారు సరకు తీసుకొని డబ్బులు ఇవ్వడం లేదా క్యూఆర్ స్కానర్ ద్వారా వారికి డబ్బులు పంపుతున్నారు. దూల్‌పేట్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా నుంచి గంజా తీసుకువచ్చి 5 గ్రాములు, 10 గ్రాములు ఇలా ప్యాక్ చేస్తూ విక్రయిస్తున్నారు. ఇలా గంజాను విక్రయిస్తు దాదాపు రూ.4 కోట్ల వరకు సంపాదించారు. మేము ఇప్పుడు నానక్రామ్గుడాపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం. డ్రగ్స్‌కి సంబంధించి చిన్న వ్యాపారం జరిగినా వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటాము." - గుమ్మి చక్రవర్తి, యాంటి నార్కొటిక్స్ బ్యూరో ఎస్పీ
ప్రజల ఆరోగ్యం, శాంతిభద్రతలకు కారణమవుతున్న మాదకద్రవ్యాల క్రయవిక్రయాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఏదైనా సమాచారం ఉంటే టీఎస్‌న్యాబ్ 8712671111 నెంబరును సంప్రదించాలని టీఎస్ నార్కొటిక్స్ ఎస్పీ చక్రవర్తి గుమ్మి కోరారు. గంజాయి ముఠా ఆటకట్టించడంలో కీలకంగా వ్యవహరించిన గోల్కొండ పోలీసులను అభినందించారు.
Ganja Gang Arrested : కారు నంబరు ప్లేటు మారుస్తూ.. గంజాయి రవాణా చేస్తున్న ముఠా అరెస్టు
Gold Smuggling in Hyderabad : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 1.27 కోట్ల విలువైన బంగారం సీజ్