ETV Bharat / state

'యూనిట్​ ఆధారిత బీమా పాలసీని రద్దు చేయవద్దు' - యూనిట్​ ఆధారిత బీమా పాలసీని రద్దుపై తీర్పు

యూనిట్ ఆధారిత బీమా పాలసీని రద్దు చేయడాన్ని హైదరాబాద్ జిల్లా మూడో వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ తప్పుపట్టింది. బీమా పాలసీని పునరుద్ధరించి కొనసాగించాలని మెట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్​ను ఆదేశించింది.

'యూనిట్​ ఆధారిత బీమా పాలసీని రద్దు చేయవద్దు'

author img

By

Published : Nov 1, 2020, 9:45 AM IST

యూనిట్ ఆధారిత బీమా పాలసీదారుడు వినియోగదారుల చట్టం పరిధిలోకి వస్తారని హైదరాబాద్ జిల్లా మూడో వినియోగదారుల కమిషన్ తేల్చి చెప్పింది. బీమా పాలసీని పునరుద్ధరించి కొనసాగించాలని మెట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్​ను ఆదేశించింది.

ఇదీ జరిగింది..

హైదరాబాద్ నింబోలి అడ్డాకు చెందిన 71 ఏళ్ల విష్ణుదాస్ 2010 ఆగస్టు 26న మెట్ స్మార్ట్ లైఫ్ యూనిట్ ఆధారిత బీమా పాలసీ తీసుకున్నారు. 33 ఏళ్ల వ్యవధితో 14 లక్షల 50 వేల బీమా కోసం విష్ణుదాస్ ఐదేళ్ల పాటు ఏడాదికి రూ. 50వేల చొప్పున ప్రీమియం చెల్లించాడు. అయితే మోర్టాలిటీ ఛార్జీలు ఎక్కువగా వసూలు చేస్తున్నారని.. పూర్తి వివరాలు తెలపాలని విష్ణుదాస్ మెట్ లైఫ్ ఇన్సూరెన్స్​కు 2015 జూన్​లో నోటీసులు పంపించారు.

ఆ తర్వాత విష్ణుదాస్ బీమా పాలసీని రద్దు చేసిన మెట్ లైఫ్ ఇన్సూరెన్స్ రూ. 3 లక్షల 12 వేల 499 చెక్కును పంపించింది. తన అనుమతి లేకుండా బీమా పాలసీని రద్దు చేశారని మెట్ లైఫ్, ఐఆర్​డీఏలను ప్రతివాదులుగా పేర్కొంటూ విష్ణుదాస్ హైదరాబాద్ జిల్లా మూడో వినియోగదారుల కమిషన్​ను ఆశ్రయించారు.

లాభాల కోసం పెట్టుబడి పెట్టారు కాబట్టి విష్ణుదాస్ వినియోగదారుల పరిరక్షణ చట్టం పరిధిలోకి రారని మెట్ లైఫ్ వాదించింది. మోర్టాలిటీ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని.. పొరపాటున బీమా తీసుకున్నట్లు నోటీసులు విష్ణుదాస్ పేర్కొన్నందున పాలసీ రద్దు చేసినట్లు తెలిపింది. ఐఆర్​డీఏ వాదనతో ఏకీభవించిన కమిషన్.. ప్రతివాదుల జాబితాలోంచి తొలగించింది. విష్ణుదాస్ వినియోగదారుల పరిరక్షణ చట్టం పరిధిలోకి వస్తారని స్పష్టం చేసింది.

ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా పాలసీ రద్దు చేసి, సొమ్ము చెల్లించడాన్ని తప్పుపట్టింది. విష్ణుదాస్​ బీమా పాలసీని పునరుద్ధరించి కొనసాగించాలని మెట్ లైఫ్ ఇన్సూరెన్స్​ను ఆదేశిస్తూ హైదరాబాద్ జిల్లా మూడో వినియోగదారుల కమిషన్ తీర్పు వెల్లడించింది.

ఇదీ చూడండి: జేఎన్‌టీయూహెచ్‌ విస్తరణ కష్టమే.. కొత్త కోర్సులు ఇతర ప్రాంగణాలకే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.