జమ్మూకశ్మీర్‌లో అల్లర్లు జరుగుతున్నాయంటూ... సామాజిక మాధ్యమాల్లో కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. అలా చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ హెచ్చరించారు. అఫ్గానిస్థాన్, ఇరాక్‌లో గతంలో జరిగిన అల్లర్లను ఎడిటింగ్ చేసి.. సామాజిక మాధ్యమాల్లో ఫార్వర్డ్ చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్ మహానగరంలో శాంతిభద్రతల సమస్యలు సృష్టించడమే లక్ష్యంగా ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని అంజనీ కుమార్ తెలిపారు.
ఇదీ చూడండి: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీపీ