ETV Bharat / state

CP Anjani Kumar at Job Mela: మీ నైపుణ్యాలను పెంచుకునేందుకు ఇదొక సువర్ణావకాశం: అంజనీ కుమార్ - హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్

జాబ్‌ కనెక్ట్‌ (job connect)పేరిట నిర్వహించే ఉద్యోగ మేళాతో యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌(CP Anjani Kumar at Job Mela) తెలిపారు. అమీర్‌పేట్‌లో పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉద్యోగ మేళాను ఆయన ప్రారంభించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా గత ఆరేళ్లుగా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు సీపీ వెల్లడించారు.

CP Anjani Kumar at Job Mela
హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌
author img

By

Published : Sep 25, 2021, 4:19 PM IST

పోలీసులు కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా సమాజ సేవలోనూ భాగస్వాములు కావాలని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ అన్నారు. ఉద్యోగ మేళాతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. జాబ్‌ కనెక్ట్‌(job connect పేరుతో పోలీసుల ఆధ్వర్యంలో అమీర్‌పేట్‌లో నిర్వహిస్తున్న ఉద్యోగ మేళాను(job mela) ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 22 కంపెనీలు దాదాపు 2 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీపీ స్పష్టం చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌

గత ఆరేళ్లుగా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రతి నెల ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగులకు ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు అంజనీ కుమార్ తెలిపారు. సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని హాజరైన అభ్యర్థులకు అంజనీ కుమార్ సూచించారు. పశ్చిమ మండలంలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో దాదాపు 5 వేల మంది నిరుద్యోగులు మేళాకు హాజరయ్యారు.

జీవితమనేది ఓ పెద్ద జర్నీ లాంటిది. ఈ ఒక్క అడుగుతోనే మీ కెరియర్​ ప్రారంభమవ్వాలి. వచ్చిన ఈ అవకాశాన్ని మీరు అనుకూలంగా మలుచుకోవాలి. ప్రతి ఒక్కరూ సానుకూలంగా ఆలోచించండి. నెగెటివ్ ఆలోచనలు తీసేయండి. ఇక్కడి నుంచి మీ జర్నీని ప్రారంభించండి. మీ నైపుణ్యాలను మరింత పెంచుకోండి. దేశంలోనే అతిపెద్ద జాబ్​ మేళాను మనం నిర్వహిస్తున్నాం. మీరంతా అదృష్టవంతులు. హైదరాబాద్​కు కొత్త కంపెనీలు వస్తున్నాయి. ఎన్నో స్టార్టప్స్ ప్రారంభమవుతున్నాయి. దాదాపు 2 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు వచ్చాయి. - అంజనీ కుమార్, హైదరాబాద్ సీపీ

ఇదీ చూడండి: నిరుద్యోగులకు ఉపాధి బాట వేస్తున్న ఈఎస్‌సీఐ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.