ETV Bharat / state

వచ్చిన ఉద్యోగంలో అంచెలంచెలుగా ఎదగండి: అంజనీ కుమార్ - జాబ్​ మేళా వార్తలు

మొదటి జర్నీలో వచ్చిన చక్కటి ఉద్యోగ అవకాశాన్ని ఉపయోగించుకుని అంచెలంచెలుగా ఎదగడానికి కృషి చేయాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీకుమార్ ఆకాక్షించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ నగరంలో పోలీసుల ఆధ్వర్యంలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నామని సీపీ తెలిపారు.

hyderabad cp anjani kumar on job mela
'దేశంలో ఎక్కడా లేనివిధంగా పోలీసుల ఆధ్వర్యంలో జాబ్​మేళా'
author img

By

Published : Feb 20, 2021, 2:29 PM IST

హైదరాబాద్ సిటీ పోలీసు, వెస్ట్‌జోన్‌ పోలీసుల ఆధ్వర్యంలో హబీబ్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధి మల్లెపల్లిలోని అన్వర్‌ ఉల్‌ ఉలూమ్‌ కాలేజీలో జాబ్​మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీ అంజనీకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెండు రోజులలో 2,501 మంది నిరుద్యోగ అభ్యర్థులు పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. ప్రస్తుతం 2,500 ఉద్యోగాలు ఉన్నాయని... మేళాకు 40 కంపెనీలు వచ్చాయని సీపీ వివరించారు.

ఇప్పటి వరకు పలు కంపెనీల సహకారంతో నగరంలో 15జాబ్‌ మేళాలు నిర్వహించామని... 15వేల మంది ఉద్యోగాలు పొందారని అంజనీకుమార్ వెల్లడించారు. లాక్‌డౌన్‌ తరువాత జాబ్‌మేళాను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

ఇదీ చూడండి: ఈనెల 22న బల్దియా మేయర్, ఉపమేయర్​ బాధ్యతల స్వీకరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.