ETV Bharat / state

లాక్​డౌన్​కు ప్రజలంతా సహకరించాలి: సీపీ అంజనీ కుమార్

author img

By

Published : May 21, 2021, 6:06 PM IST

దేశంలోనే హైదరాబాద్ మెడికల్ హబ్​గా ఉందని సీపీ అంజనీ కుమార్ అన్నారు. దిల్​సుఖ్​ నగర్​లో నిర్వహిస్తోన్న తనిఖీ కేంద్రాన్ని పరిశీలించిన ఆయన పలు వాహనదదారులను ఆపి ప్రశ్నించారు. ప్రతీ ఒక్కరూ సర్కారు విధించిన ఆంక్షలను కచ్చితంగా పాటించాలని ఆయన కోరారు.

CP visiting Dilsukhnagar check post
దిల్​సుఖ్​ నగర్ తనికీ కేంద్రాన్ని సందర్శించిన సీపీ

కరోనాను కట్టడి చేసేందుకే రాష్ట్ర ప్రభుత్వం లాక్​డౌన్​ను అమలు చేస్తోందని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అన్నారు. ప్రతీ ఒక్కరూ సర్కారు విధించిన ఆంక్షలను కచ్చితంగా పాటించాలని ఆయన కోరారు. నగరంలోని దిల్​సుఖ్​ నగర్​లో నిర్వహిస్తోన్న తనిఖీ కేంద్రాన్ని పరిశీలించిన సీపీ ఎల్బీనగర్ వైపు నుంచి వచ్చే వాహనదారును ప్రశ్నించారు. అనుమతి లేకుండా బయటికి వచ్చే వారి వాహనాలు సీజ్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు.

ప్రజలంతా లాక్​డౌన్​కు సహకరించాలని సీపీ అంజనీ కుమార్ అన్నారు. దేశంలోనే హైదరాబాద్ మెడికల్ హబ్​గా ఉందని తెలిపారు. ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఏయిర్ అంబులెన్సుల ద్వారా రాష్ట్రానికి చేరుకుని ఇక్కడి ఆసుత్రుల్లో చేరుతున్నారని పేర్కొన్నారు. కొంతమంది వాహనదారులు పోలీసులు ఇచ్చిన ఈ-పాసులను, గుర్తింపు కార్డులను దుర్వినియోగం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని... అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చదవండి: రాజీవ్​గాంధీ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్​ నేతల సేవా కార్యక్రమాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.