పోలీసు అధికారులు, సిబ్బంది ప్రతి ఒక్కరు విధిగా కొవిడ్ టీకా వేసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సూచించారు. పోలీసులు తమ కుటుంబసభ్యులకు కూడా వ్యాక్సిన్ వేయించుకునేలా చూడాలని ఆయన కోరారు. పలువురు ఇన్‌స్పెక్టర్లు, ఏసీపీలు, డీసీపీలతో ఆయన దృశ్య మాధ్యమ సమావేశాన్ని నిర్వహించారు.
వీడియో కాన్ఫిరెన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లోని పోలీసు చెక్‌పోస్టుల వద్ద లాక్‌డౌన్ అమలు తీరును సీపీ అంజనీ కుమార్ అధికారులను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. నిబంధనలు పాటించని వారిపై, సరైన అనుమతులు లేకుండా రోడ్లపైకి వచ్చే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్‌లు చౌహాన్, అనీల్‌కుమార్, షికా గోయల్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: Ministers Fire: ఓనర్లమని చెప్పి క్లీనర్‌గా మారావ్..