గత మూడు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు సికింద్రాబాద్ రామన్నకుంట చెరువు పూర్తిగా నిండి వరద నీరు కాలనీలోకి ప్రవేశించగా కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి చెరువును పరిశీలించారు. రామన్నకుంటకు వచ్చే డ్రైనేజీ నీటిని సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
రామన్నకుంట చెరువు ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో గురించి పూర్తిగా తెలుసుకుని.. పూర్తి నివేదికను తనకు అందజేయాలని అధికారులకు ఆదేశించారు. నీరు బయటకు విడుదల చేసే సమయంలో పైప్లైన్ల సామర్థ్యాన్ని గురించి కంటోన్మెంట్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికైనా రామన్నకుంట చెరువుకు శాశ్వత పరిష్కారాన్ని అందజేయాలని స్థానికులు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: యజమాని కుమారుడి చేతిలో కిరాతకానికి గురైన బాలిక మృతి