వైఎస్సార్ తెలంగాణ పార్టీ (ysrtp) అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల (ys Sharmila) రైతుల సమస్యలపై నిర్వహించ తలపెట్టిన రైతు వేదన నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. (police decline permission for Sharmila's protest) హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద షర్మిల ఇవాళ్టి నుంచి 72 గంటల దీక్ష చేపట్టాలని భావించారు.
కానీ పోలీసులు అనుమతి ఇవ్వలేదని వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. 9 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో అక్కడ కూడా దీక్ష చేయలేని పరిస్థితి ఉందని పార్టీ నేతలు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: TGOS MEET CM KCR: తెలంగాణలో భారీ ఉద్యోగ నియామక ప్రక్రియ అప్పుడేనట!