ETV Bharat / state

భాగ్యనగరంలో నేటి నుంచి సిటీ బస్సులు - భాగ్యనగరంలో రోడ్డెక్కనున్న సిటీ బస్సులు

సుమారు ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఆర్టీసీ సిటీ బస్సులు నేడు రోడ్డెక్కబోతున్నాయి. దశల వారీగా సిటీ బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని యాజమాన్యం నిర్ణయించింది. మొదటి దశలో 25శాతం బస్సులను మాత్రమే నడపనున్నారు. నేటి నుంచి బస్సులు నడిపేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని గ్రేటర్ పరిధిలో ఉన్న అన్ని డిపోల మేనేజర్లకు అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. సిటీ బస్సులతో పాటు.. తెలంగాణ నుంచి మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు ఆర్టీసీ బస్సులు నేటి నుంచి నడవనున్నాయి.

hyderabad city bus services resume from today
భాగ్యనగరంలో రోడ్డెక్కనున్న సిటీ బస్సులు
author img

By

Published : Sep 25, 2020, 5:04 AM IST

కొవిడ్ -19ను ఎదుర్కొనేందుకు లాక్​డౌన్​లో భాగంగా మార్చి 22 నుంచి ఆర్టీసీ బస్సులను నిలిపివేసింది. అన్​లాక్​లో భాగంగా ప్రభుత్వం ప్రజా రవాణా వ్యవస్థకు అనుమతి ఇవ్వడం వల్ల ముందుగా జిల్లాలకు బస్సులను నడిపించడం ప్రారంభించారు. ఆ సమయంలో గ్రేటర్ పరిధిలో కరోనా కేసులు భారీగా ఉండడం వల్ల సిటీ బస్సులు నడపడం అంత శ్రేయస్కరం కాదని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ తర్వాత మెట్రో రైలును ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రెండో రోజుల క్రితం నగర శివార్లలో ఉన్నటువంటి ప్రాంతాల నుంచి జిల్లాలకు సుమారు 135 రూట్లలో ఆర్టీసీ బస్సులను ప్రారంభించారు. గత రెండు వారాల నుంచి గ్రేటర్ పరిధిలో ఆర్టీసీ బస్సులను సిద్దంగా ఉంచిన అధికారులు సీఎం కేసీఆర్ నిర్ణయం కోసం వేచిచూశారు. సీఎం కేసీఆర్ సిటీ బస్సులు నడిపించేందుకు అనుమతి ఇవ్వడంతో నేటి నుంచి ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కబోతున్నాయి.

ప్రస్తుతం 25శాతం బస్సులు

గ్రేటర్ పరిధిలో 29 డిపోల్లో సుమారు 2,900ల బస్సులు ఉన్నాయి. వీటిలో హైదరాబాద్ రీజియన్ లో 1,700ల బస్సులు, సికింద్రాబాద్ రీజియన్​లో 1,200ల బస్సులు గతంలో నడిచేవి. వీటిలో ప్రస్తుతం 25శాతం బస్సులను నడపాలని సీఎం ఆదేశించడం వల్ల... సుమారు 650 బస్సులు నడవనున్నాయి. వీటితో పాటు లాక్​డౌన్​కు ముందు ఆగిపోయిన అంతరాష్ట్ర సర్వీసులను కూడా పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ రాష్ట్రం నుంచి గతంలో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు ఆర్టీసీ బస్సులు నడిచేవి. వాటిని యధావిధిగా నేటి నుంచి నడపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. నేటి నుంచి మహారాష్ట్ర, కర్ణాటక బస్సులు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాయని ప్రజలు వాటిని వినియోగించుకోవాలని ఆర్టీసీ విజ్ఞప్తి చేస్తుంది.

బస్సుల్లో కొవిడ్​ నిబంధనలు పాటించాలి

సిటీ బస్సులు, అంతరాష్ట్ర సర్వీసుల్లో కొవిడ్ నిబంధనలను పాటించే విధంగా చర్యలను తీసుకోవాలని అధికారులు డిపో మేనేజర్లకు సూచనలిచ్చారు. శానిటైజర్, మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్నారు. కరోనా బారి నుంచి సిబ్బందిని రక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ కార్మిక సంఘాలు యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాయి.

ఇవీ చూడండి:పెరుగుతున్న గుడ్డు వినియోగం.. కోలుకుంటున్న పౌల్ట్రీ పరిశ్రమలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.