TS Rains: రాష్ట్రంలో ఇవాళ, రేపు అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో గంటకు 30 నుంచి 40 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు హెచ్చరించారు. నిన్నటి తీవ్ర అల్పపీడనం బలహీనపడి ఈ రోజు ఉదయం అల్పపీడనంగా మారిందని తెలిపారు.
ప్రస్తుతం ఉత్తర ఒడిశా తీరము పరిసర ప్రాంతంలో అల్పపీడనంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ వరకు విస్తరించి ఎత్తుకి వెళ్లే కొలది నైరుతి దిశగా వంపు తిరిగి ఉందన్నారు. ఈరోజు రుతుపవన ద్రోణి జైసల్మీర్, కోట, గుణ , సాగర్, జబల్పూర్, పెండ్రా రోడ్, అల్పపీడన మధ్యభాగం మీదుగా ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించి ఉందని వాతావరణ కేంద్ర సంచాలకులు వివరించారు.
ఇవీ చదవండి: