ETV Bharat / state

Hyderabad Airport is Most Punctual : సమయపాలనలో నంబర్ వన్ 'శంషాబాద్ ఎయిర్​పోర్టు' - Hyderabad Airport is Most Punctual

Hyderabad Airport is the World's Most Punctual Airport : ప్రపంచంలోనే అత్యంత సమయపాలన (పంక్చువాలిటీ) కలిగిన విమానాశ్రయంగా హైదరాబాద్​లోని శంషాబాద్​ విమానాశ్రయం నిలిచింది. ఏవియేషన్‌ అనలిటికల్‌ అనే సంస్థ తన సర్వేలో.. మార్చి నెలలో హైదరాబాద్ ఎయిర్​పోర్టు 90.43శాతం ఆన్‌-టైమ్‌ పెర్ఫార్మెన్స్‌ నమోదు చేసినట్లు తేలిందని ప్రకటించింది.

Shamshabad airport
Shamshabad airport
author img

By

Published : May 12, 2023, 12:58 PM IST

Hyderabad Airport is the World's Most Punctual Airport : దేశంలోనే మొదటి గ్రీన్​ఫీల్డ్​ విమానాశ్రయంగా గుర్తింపు పొందిన హైదరాబాద్​లోని శంషాబాద్‌ విమానాశ్రయం మరో అరుదైన ఘనతను కైవసం చేసుకొంది. ప్రపంచంలోనే అత్యంత సమయపాలన (టైమ్​ పంక్చువాలిటీ) కలిగిన విమానాశ్రయంగా రికార్డులోకి ఎక్కింది. ఈ మేరకు ఏవియేషన్‌ అనలిటికల్‌ సంస్థ ‘సిరియమ్‌’ (సీఐఆర్‌ఐయూఎం) ఇటీవల విడుదల చేసిన నివేదికలో శంషాబాద్‌ విమానాశ్రయం మార్చి నెలలో 90.43 శాతం ఆన్‌-టైమ్‌ పెర్ఫార్మెన్స్‌ నమోదు చేసినట్లు ప్రకటించింది.

Hyderabad Airport is Most Punctual : సమయపాలనలో 90 శాంతం మార్కును దాటిన ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయంగా శంషాబాద్​ విమానాశ్రయం నిలిచింది. గతేడాది నవంబర్‌లో సమయపాలన నివేదికలో 88.44 శాతంతో నాల్గో స్థానంలో ఉన్న ఉండగా కేవలం 4 నెలల్లోనే ప్రథమ స్థానం దక్కించుకుందని విమానాశ్రయ అధికారులు పేర్కొన్నారు. సిరియమ్‌ సంస్థ మార్చి నెలలో ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ విమానాశ్రయాల్లోని 50 లక్షల విమానాల రాకపోకలను విశ్లేషించింది. ఈ క్రమంలోనే సమయ పాలనతోపాటు ‘గ్లోబల్‌ ఎయిర్‌పోర్ట్‌’ ‘లార్జ్‌ ఎయిర్‌పోర్ట్‌’ విభాగాల్లోనూ శంషాబాద్‌ అగ్రస్థానంలో నిలిచింది.

World most punctual airport award to Hyderabad Airport : సిరియమ్​ సంస్థ చేసిన సర్వేలో వాస్తవ నిష్క్రమణ సమయం (డిపార్చర్‌) 80 శాతం, ప్రయాణికులు లోపలికి అడుగుపెట్టాక విమానం ఎక్కే సమయం, విమానాశ్రయ సేవల అంశాలను పరిగణనలోకి తీసుకొని విశ్లేషించింది. ఈ మూడు అంశాల్లో అత్యుత్తమంగా శంషాబాద్‌ విమానాశ్రయం నిలిచిందని విమానాశ్రయ సీఈవో ప్రదీప్‌ ఫణికర్‌ ప్రకటించారు.

ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. నిరాటంక ప్రయాణ అనుభవాన్ని ప్రయాణికులకు అందించడం, తమ గమ్యస్థానాన్ని ప్రయాణికులు సరైనా సమయానికి చేరుకునేలా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకొంటున్నట్లు ఆయన వివరించారు. ఎప్పటికప్పుడు కొత్త సాంకేతిక ఆవిష్కరణలను అమలు చేస్తూ ప్రణాళికలను మెరుగు పరుస్తున్నట్లు సీఈవో ప్రదీప్​ ఫణికర్​ తెలిపారు.

ఈ సేవలే పురస్కారాలు తీసుకొచ్చాయి : శంషాబాద్​ విమానాశ్రయంలో ప్రయాణికులకు అన్ని రకాలు సేవలను అధికారులు అందుబాటులో ఉంచారు. సమీకృత వ్యవస్థలు, కేంద్రీకృత ఎయిర్‌పోర్ట్‌ ఆపరేషన్స్‌ కంట్రోల్‌ సెంటర్​ను ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు ప్రత్యేక సమాచార వ్యవస్థలు ఎక్కడిక్కడ లభించేలా చర్యలు తీసుకున్నారు. ఎక్కువ లగేజీ లేనివారికి ఎక్స్‌ప్రెస్‌ సెక్యూరిటీ చెక్‌-ఇన్‌, సెల్ఫ్‌ చెక్‌-ఇన్‌లు ఏర్పాటు చేశారు. కియోస్క్‌లు, వీడియో అనలిటిక్స్‌ తదితర ప్రధానమైనవి ఎయిర్​పోర్టులో అమర్చిచారు. పై అంశాలన్నీ శంషాబాద్​ విమానాశ్రయానికి ప్రపంచంలోనే అత్యంత సమయపాలన కలిగిన విమానాశ్రయంగా గుర్తింపు తెచ్చినట్లు ఎయిర్​పోర్టు అధికారులు హర్షం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.