బడ్జెట్ సమావేశాల రెండోరోజు ఇవాళ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌పై ఉభయసభల్లో చర్చ జరగనుంది. శాసనసభ ప్రారంభం కాగానే ఇటీవల మరణించిన ఉమ్మడి రాష్ట్ర మాజీ గవర్నర్ ఎన్డీతివారి, 16 మంది మాజీ ఎమ్మెల్యేలకు సభ సంతాపం తెలుపనుంది.
అనంతరం రానున్న ఆర్థిక సంవత్సరంలో ఆరునెలల కాలానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై సభలో చర్చ చేపడతారు. దీనికి ముఖ్యమంత్రిసమాధానం చెప్తారు.
ఆ తర్వాత అసెంబ్లీలో పంచాయతీరాజ్ చట్ట సవరణ ఆర్డినెన్స్, జీఎస్టీ చట్టసవరణ ఆర్డినెన్స్ బిల్లులపై చర్చ జరగనుంది.