తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైన తొలి రోజున మొత్తం 756 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో 665 నామపత్రాలు మండల పరిషత్తులకు, 91 నామినేషన్లు జిల్లా పరిషత్తులకు అందాయి. మూడు విడుతల ఎన్నికల్లో భాగంగా తొలివిడత ఎన్నికలకు సంబంధించిన నోటీసులను ఆయా మండలాల్లోని రిటర్నింగ్ అధికారులు వెల్లడించారు.
పెద్ద సంఖ్యలో నామపత్రాలు దాఖలు...
మొదటి విడతకు చెందిన 2,166 మండల పరిషత్తు ప్రాదేశిక స్థానాలకు, 197 జిల్లా పరిషత్తు ప్రాదేశిక స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటికి సంబంధించి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం మొదలైంది. మంచి రోజు కావడంతో తొలి రోజునే పెద్ద సంఖ్యలో నామపత్రాలు దాఖలు చేశారు.
మండల పరిషత్తులకు తొలి రోజు నామినేషన్లు
పార్టీ | ఎంపీటీసీ |
---|---|
తెరాస | 296 |
కాంగ్రెస్ | 216 |
భాజపా | 30 |
సీపీఐ | 2 |
సీపీఎం | 6 |
తెదేపా | 2 |
ఇతర పార్టీలు | 4 |
స్వతంత్రులు | 113 |
మొత్తం స్థానాలు | 665 |
జిల్లా పరిషత్ ప్రాదేశిక స్థానాలకు దాఖాలైన నామినేషన్లు...
పార్టీ | జడ్పీటీసీ |
---|---|
తెరాస | 30 |
కాంగ్రెస్ | 38 |
భాజపా | 6 |
సీపీఐ | 1 |
సీపీఎం | 1 |
తెదేపా | 1 |
స్వతంత్రులు | 14 |
ఇతరులు | 0 |
మొత్తం స్థానాలు | 91 |
ఇవీ చూడండి: కాంగ్రెస్కు గండ్ర షాక్... త్వరలో తెరాసలోకి