ETV Bharat / state

షోరూమ్ 'రిజిస్ట్రేషన్'.. కొత్త పరేషాన్..!

వాహనాల రిజిస్ట్రేషన్ ఏప్రిల్ ఒకటి నుంచి షో రూముల్లోనే చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీని  సాధ్యాసాధ్యాలపై రవాణాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ విధానం అమలుకు సాంకేతిక సమస్యలు చాలా అడ్డొస్తున్నాయి. షోరూమ్​ రిజిస్ట్రేషన్ కోసం... ఆర్టీఏకు, డీలర్​ను అనుసంధానం చేసే సాఫ్ట్​వేర్ అందుబాటులోకి రాలేదు. ఈ పరిస్థితుల్లో ఏప్రిల్ నుంచి షోరూమ్​ రిజిస్ట్రేషన్​ సాధ్యం కాకపోవచ్చు.

author img

By

Published : Mar 24, 2019, 8:47 PM IST

షోరూమ్ 'రిజిస్ట్రేషన్'.. కొత్త పరేషాన్..!
షోరూమ్ 'రిజిస్ట్రేషన్'.. కొత్త పరేషాన్..!
వాహన రిజిస్ట్రేషన్లు ఇప్పటి వరకు రవాణాశాఖ కార్యాలయాల్లోనే జరిగేవి. కేంద్ర ప్రభుత్వం తాజాగా ఏప్రిల్ ఒకటి నుంచి షోరూముల్లోనే చేయాలని నిర్ణయించింది. నాలుగు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకుశాశ్వత నంబర్ ప్లేట్​లను షోరూముల్లోనే ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం సంయుక్త రవాణాశాఖ అధికారులు, ఉప రవాణా శాఖ అధికారులతో ఓ కమిటీ నియమించింది. షోరూముల్లో రిజిస్ట్రేషన్ల సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని కమిటీని ఆదేశించింది.

రోజులు గడుస్తున్నా నేటికి కమిటీ విధి విధానాలు రూపొందించలేదు. ఏప్రిల్ 1 దగ్గర పడుతుండటంతో అత్యవసరంగా ఆర్టీఎ అధికారులు, ఎంవీఐలు, పరిపాలన అధికారులతో ఖైరతాబాద్​లోని కేంద్ర రవాణాశాఖ కార్యాలయంలో సమావేశమయ్యారు. ఈ భేటీలో డీలర్ల సాప్ట్​వేర్​కు సంబంధించి కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తున్నాయని ఆర్టీఎ అధికారులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికిప్పుడే దీన్ని అమలుచేయడం వల్ల ఇబ్బందులు వస్తాయని గుర్తించారు.

తొలివిడతలో ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్ పరిశీలించాలని యోచిస్తున్నారు. అది సత్ఫలితాలు ఇస్తే వెంటనే ఆటోలు, కార్లకు కూడా అనుమతివ్వనున్నారు. ప్రభుత్వ వాహనాలకు వీటి నుంచి మినహాయింపు వుంది. ఫ్యాన్సీ నంబర్లు కావాలనుకున్నవారు ప్రస్తుతం అమల్లో ఉన్న ఆన్​లైన్ వేలం పాట ద్వారా పొందవచ్చు. ఈ నిబంధన అమల్లోకి వస్తే తాత్కాలిక రిజిస్ట్రేషన్, పూర్తిస్థాయి రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఎ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని ఉండదు.

తాత్కాలిక రిజిస్ట్రేషన్ కోసం వాహనదారుల నుంచి షోరూమ్ డీలర్లు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు వున్నాయి. పూర్తిస్థాయి రిజిస్ట్రేషన్​ షో రూమ్ ద్వారానే జరిగితే అవినీతి మరింత పెరిగే ప్రమాదం ఉందని వాహన చోదకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటిపై రవాణాశాఖ అధికారుల నిఘా ఉండాలని కోరుతున్నారు.

మొత్తంమీద సాధ్యసాధ్యాల పరిశీలన, సాఫ్ట్​వేర్ పూర్తిస్థాయిలో సిద్ధం కాకముందే.. షోరూమ్ రిజిస్ట్రేషన్​తో ఇబ్బందులు తప్పకపోవచ్చనిపిస్తోంది.

Intro:Hyd_TG_23_24_tb_day_celabrate_AB_c28.... టీబీ అనేది అంటువ్యాధి కాదని దీనికి చికిత్స చేయడానికి ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయని వాటిని ఉపయోగించడం ద్వారా టీబీ ని తరిమి కొట్టవచ్చునని డిఎంఅండ్హెచ్ఓ డాక్టర్ వెంకట్ అన్నారు.. ప్రపంచ టీబీ వ్యాధి నివారణ దినోత్సవం పురస్కరించుకొని స్థానిక ఎర్రగడ్డలోని t.b. హాస్పిటల్ నందు టీ బి వ్యాధిగ్రస్తులకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు

Body:ఈ సందర్భంగా గా dm&ho డాక్టర్ వెంకట్ మాట్లాడుతూ టిబి అనేది అంటువ్యాధి కాదని దీనిని పూర్తిగా నయం చేయడానికి సరైన చికిత్స చేసుకుంటే టిబి ని దూరం చేయవచ్చని ఆయన అన్నారు సరైన ఆహార పద్ధతులను అలవాటు చేసుకున్న అప్పుడే టి బి అనేది మనుషుల నుంచి దూరం చేయవచ్చని ఆయన అన్నారు క్రమం తప్పకుండా మందులు వాడి చికిత్స పూర్తి చేసుకుంటే తగిన చర్యలు తీసుకోవచ్చని అప్పుడే దీనిని నిర్మూలించవచ్చని ఆయన పేర్కొన్నారు ముఖ్యంగా చికిత్స విషయంలో కుటుంబ సభ్యుల సహకారం ఎంతో అవసరమని తెలిపారు టీవీ అనేది అంటువ్యాధి కాదని కేవలం మానసిక వేదనే అని ఆయన తెలిపారు

Conclusion:అనంతరం టి బి వ్యాధిని పడిన రోగులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ వ్యాధి సోకిన వారితో ప్రతి ఒక్కరు కలుపుకొని జీవించడంలో వారిలో నిరాశ నిస్పృహ దూరం చేయవచ్చని ఈ కార్యక్రమంలో తెలిపారు కార్యక్రమంలో పలువురు డాక్టర్లు విధంగా స్వచ్ఛంద సంస్థ వారు పాల్గొన్నారు....bite... డీఎంహెచ్వో డాక్టర్ వెంకట్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.