ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ చేయించాలని రాష్ట్ర పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగటి నారాయణ డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ వ్యవహారంపై విద్యార్థుల తల్లిదండ్రులతో చర్చించారు. ఫలితాల్లో తప్పిదాల వల్ల 16 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. విద్యారంగం పట్ల ప్రభుత్వ వైఖరేంటో ఇంటర్ ఫలితాలు చూస్తే తెలుస్తోందన్నారు.
ఇవీ చూడండి: కళ్లు తెరవండి... పరీక్ష పత్రాలు మళ్లీ దిద్దండి