స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం స్థానిక నేతలను ఆదేశించింది. గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి ఆర్సీ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, జిల్లా సమన్వయకర్తలు పాల్గొన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యుహాలపై చర్చించారు. అధికార పార్టీకి దీటైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు స్థానిక నేతలు చొరవ చూపాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉంటూ, విజయావకాశాలు కలిగిన వారినే అభ్యర్థులుగా ఎంపిక చేయాలని సూచించారు.
ఇవీ చూడండి: శిక్షణ కోసం వెళ్తే... లైంగికంగా వేధించాడు