ETV Bharat / state

అదృశ్య కేసులపై దర్యాప్తు ముమ్మరం - gg

అదృశ్య కేసులను తెలంగాణ పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్​ సైబరాబాద్ పరిధిలో అదృశ్య కేసులను 24 గంటల్లోనే ఛేదించారు. చిన్నారులు తప్పిపోతే కుటుంబసభ్యులు, బంధువులు సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

అదృశ్య కేసులపై దర్యప్తు ముమ్మరం
author img

By

Published : Jun 12, 2019, 7:35 AM IST

Updated : Jun 12, 2019, 11:47 AM IST

అధికారుల ఒత్తిడి, పత్రికల కథనాలతో పోలీస్​ యంత్రాంగం మేలుకొంది. రాష్ట్ర వ్యాప్తంగా అదృశ్యమైన కేసులను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పలు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. సైబరాబాద్ పరిధిలో అదృశ్య కేసులను 24 గంటల్లోనే ఛేదించారు.

ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తాం

అదృశ్య కేసులపై ప్రత్యేక దృష్టి సారించిన పోలీసులు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ప్రజలు భయాందోళన చెందవద్దని సైబరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ ప్రజలకు అభయమిచ్చారు. మిస్సింగ్ కేసులకు సంబంధించి కుటుంబసభ్యులు, బంధువులెవరైనా సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తామని తెలిపారు.
అదృశ్యమైన బాలికలు క్షేమం..!
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి కిస్మత్ పుర గ్రామం సాయిబాబా కాలనీలోని చెరిష్ అండర్ ప్రేవిలైజ్ లైవ్స్ హోమ్​కు చెందిన మిస్సింగ్ కేస్​ను సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. ఏడో తరగతి విద్యార్థిని మాయ, ఐదో తరగతి విద్యార్థిని పార్వతి (13), జయ (12), రాణి (13) ఈ నెల 8న బయటకి వెళ్లి తిరిగిరాలేదు. చుట్టుపక్కల వెతికినా ఆచూకీ లభించలేదు. వెంటనే హాస్టల్​ సిబ్బంది తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. స్థానిక రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.
సీసీఫుటేజ్​ ఆధారంగా కేసు ఛేదించిన పోలీసులు
ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు... రెండు, మూడు బృందాలుగా విడిపోయి చిన్నారులకోసం గాలింపు చేపట్టారు. స్థానికుల సమాచారం, సీసీఫుటేజ్​ల ఆధారంగా 24 గంటల్లోనే కేసును ఛేదించి తల్లిదండ్రులకు అప్పగించారు. తప్పిపోయిన వారిని గుర్తించేందుకు లేటెస్ట్ లొకేషన్ ఫైండ్ యాప్స్, జీపీఎస్ గ్యాడ్జెట్స్​ను వాడడం ఉత్తమమని సీపీ సూచించారు. తప్పిపోయిన వారు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా సైబరాబాద్ వాట్సాప్ నంబర్ 9490617444, రాచకొండ వాట్సాప్ నంబర్ 9490617111కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇవీ చూడండి: ఇవాళ్టి నుంచి పాఠశాలలు పునః ప్రారంభం

Intro:TG_KRN_10_11_SUMMER_SIBIRAM_CULTERER_AV_C5

వేసవి సెలవులను విద్యార్థులు వృధా చేసుకోకుండా కరీంనగర్ లో క్రీడా ప్రాధికార సంస్థ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఉచిత వేసవి శిక్షణా శిబిరాలు నిర్వహించారు 40 రోజుల శిక్షణా శిబిరంలో విద్యార్థులు నేర్చుకున్న అంశాలు పలు క్రీడా ఆటలు ఎంతగానో ఉపయోగపడ్డాయని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు వేసవి శిబిరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్ అంబేద్కర్ స్టేడియం లో ముగింపు కార్యక్రమాన్ని క్రీడా ప్రాధికార సంస్థ చేపట్టింది దీనిలో భాగంగా విద్యార్థులు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి మూడు వేల మంది దరఖాస్తు చేసుకోగా దాదాపు 1000 మంది పిల్లలు ఈ వేసవి శిక్షణా శిబిరాలను వినియోగించుకున్నారని నిర్వాహకులు తెలిపారు

Body:య్

Conclusion:య్
Last Updated : Jun 12, 2019, 11:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.