ETV Bharat / state

ఇవాళ కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు

తెరాస ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా నేడు పెద్ద ఎత్తున కాంగ్రెస్​ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణకు డిమాండ్​ చేస్తోంది. బోర్డు నిర్వాకం వల్ల 20మందికిపైగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడాన్ని హస్తం పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది.

ఇవాళ కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు
author img

By

Published : May 1, 2019, 6:39 AM IST

Updated : May 1, 2019, 7:41 AM IST

ఇవాళ కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు

ఇంటర్ ఫలితాల్లో తప్పులపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫలితాల్లో చోటు చేసుకున్న తప్పిదాలతో 20మందికిపైగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడడాన్ని కాంగ్రెస్​ తీవ్రంగా పరిగణిస్తోంది. తెరాస ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా ఇవాళ పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చింది.

ఆత్మహత్యలు వద్దు

ఇంటర్ ఫలితాలలో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ చేయాలని డిమాండ్​ చేస్తూ.. ఇవాళ కాంగ్రెస్​ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయాలని నిర్ణయించింది. విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ విద్యార్థి ఆత్మహత్యలు వద్దు పేరుతో భారీ సంతకాల సేకరణ, ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థి కుటుంబాలకు ఓదార్పు చేపట్టనుంది.

రేపు కొవ్వొత్తుల ర్యాలీ
చనిపోయిన విద్యార్థుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ రేపు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ తమ శ్రేణులకు సూచించారు. వరుస నిరసనలతో నిరంకుశ తెరాస సర్కారు తీరును ఎండగట్టి, విద్యార్థి కుటుంబాలకు అండగా నిలవాలన్నారు.

ఇవీ చూడండి: మానవ మృగాడిని పట్టుకున్న పోలీసులు

Intro:jk_tg_nzb_18_30_poola_saagutho_aadharshanga_nilusthunna_yuva_raithu_pkg_c11
( ). కాస్త విభిన్నంగా ఆలోచిస్తే చాలు వ్యవసాయంలో అద్భుతాలు సృష్టించవచ్చని నిరూపిస్తున్నారు కొంతమంది రైతులు. ఆ కోవకు చెందినవాడే ఇస్సాపల్లి శ్రీనివాస్. తన వినూత్న ఆలోచనలతో బంతి పూల సాగు చేసి అధిక లాభాలను ఆర్జిస్తూ జిల్లా రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.
vol.1 నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం నారాయణపేట గ్రామానికి చెందిన ఇస్సాపల్లి చిన్నయ్యకు ఇద్దరు సంతానం(కొడుకు, కూతురు) అందరిలాగే తన కుమారున్ని ఉన్నత చదువులు చదివించాలనే ఉద్దేశ్యంతో ఎంబీఏ చదివించాడు. 2012 సంవత్సరంలో ఎంబీఏ పూర్తి చేసిన శ్రీనివాస్ దాదాపు రెండు సంవత్సరాల పాటు ప్రైవేటు ఉద్యోగాలు చేశాడు. ఒకరి దగ్గర పని చేయడంలో సంతృప్తి చెందని శ్రీనివాస్ సొంతంగా ఏదైనా చేయాలనే ఆలోచనలో భాగంగా బంతిపూల సాగుకు శ్రీకారం చుట్టాడు.

byte. ఇస్సాపల్లి శ్రీనివాస్, యువ రైతు. నారాయణపేట్

vol.2 ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు బోరు బావులపై ఆధారపడి సాగు చేస్తున్నప్పటికీ, శ్రీనివాస్ కు 8 ఎకరాల వ్యవసాయ భూమిలో ఒక బోరు బావి కూడా లేదు. తన వినూత్న ఆలోచనలతో సాగునీటి సమస్యను అధిగమించేందుకు, వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి బావిలోని కొద్దిపాటి ఊట నీటి తో మోటార్ బిగించి బిందు సేద్యం ద్వారా బంతిపూలు సాగుచేస్తున్నారు.
మొదటిసారి అర ఎకరంలో బంతిపూల సాగు చేసినప్పటికీ అందరు రైతుల లాగే నష్టాలను చవిచూశాడు. కానీ పట్టుదలతో మళ్లీ సాగు చేసి లాభాల బాట పట్టాడు. ఒక ఎకరం బంతి సాగుకి 35 వేల రూపాయల ఖర్చు అవుతుందని, వర్షాకాలంలో ఎకరాకు 10 టన్నులు, వేసవిలో 5 నుండి 7 టన్నుల దిగుబడి వస్తుందని చెబుతున్నాడు ఆ యువ రైతు. ఈ లెక్కన వర్షాకాలంలో కిలో బంతి పూల ధర 30 నుండి 40 రూపాయల వరకు ఉండగా వేసవిలో 60 రూపాయల వరకు పలుకుతుందని, ఈ లెక్కన ఎకరాకు దాదాపు 350000 రూపాయల వరకు వస్తుందని, ఖర్చులు పోను దాదాపు 280000 రూపాయల వరకు లాభాలు ఆర్జించవచ్చని చెబుతున్నాడు.
byte. తిరుపతి, రైతు. నారాయణపేట్
byte. మనోజ్, రైతు. నారాయణపేట్
end voice. ఉన్నత చదువులు చదివిన శ్రీనివాస్ మొక్కజొన్న, మిరప వంటి పంటలు వేయడం ద్వారా సాగునీటి సమస్యతో పాటు జంతువుల బెడద ఉంటుందని దీంతో ఈ సమస్యలను అధిగమిస్తూ కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచనతో బంతి పూల సాగు వైపు దృష్టి పెట్టానని చెబుతున్నాడు. తక్కువ ఇబ్బందులతో అధిక లాభాలను పొందుతున్న ఈ యువ రైతును చుట్టుపక్కల రైతులు అభినందిస్తున్నారు.

Body:నిజామాబాద్ గ్రామీణం

Conclusion:నిజామాబాద్
Last Updated : May 1, 2019, 7:41 AM IST

For All Latest Updates

TAGGED:

CONGRES
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.