కామంతో కళ్లుమూసుకు పోయి...
బాలికల కంటే బాలురపైనే ఎక్కువగా లైంగిక దాడి ఘటనలు జరుగుతున్నాయని తెలంగాణ స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ గతంలో చేసిన ఓ పరిశోధనలో వెల్లడైంది. చాలా సందర్భాల్లో బాధిత బాలలు బయటికి చెప్పలేకపోవడం కుటుంబసభ్యులతో పాటు దగ్గరి సన్నిహితులే ఎక్కువగా అఘాయిత్యాలకు పాల్పడుతుండడం వల్ల ఈ దురాగతాలు బహిర్గతం కావడంలేదని తేల్చింది.
ప్రకృతి విరుద్ధంగా... ఇంత దారుణమా...
స్త్రీ, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిశోధనలో 53శాతం చిన్నారులు లైంగిక వేధింపులకు గురవుతుంటే వారిలో 53శాతం బాలురు ఉన్నట్లు తేలింది. చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వారిలో తాత, తండ్రి, మామ, సోదరుడు, ఇరుగు, పొరుగు వారు.. 90శాతం ఉన్నట్లు వెల్లడైంది. బాలబాలికలనే తేడా లేకుండా లైంగిక వేధింపులు జరుగుతున్నందున బాలికలతో పాటు బాలురకు కూడా అవగాహన కల్పించాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఇవీ చూడండి: సింహాన్నే పరిగెత్తించాడు- పోలీసులకు చిక్కాడు