ETV Bharat / state

మేలైన విత్తనంతోనే ఆహార భద్రత సాధ్యం - ista

నాణ్యమైన విత్తనాలు, వ్యవ‌సాయానికి అనువైన వాతావ‌ర‌ణంతోనే దేశం అభివృద్ధి సాధిస్తుందని నిపుణులు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్​ వేదికగా సాగిన అంతర్జాతీయ విత్తన పరీక్షా సంఘం - ఇస్టా సదస్సు విజయంతంగా ముగిసింది. తెలుగు రాష్ట్రాల్లో కల్తీ విత్తనాలపై ఉక్కు పాదం మోపాలని ఇస్టా సదస్సు తీర్మానించింది.

మేలైన విత్తనంతోనే ఆహార భద్రత సాధ్యం
author img

By

Published : Jun 29, 2019, 4:34 AM IST

Updated : Jun 29, 2019, 7:34 AM IST

మేలైన విత్తనంతోనే ఆహార భద్రత సాధ్యం

శ్వేత విప్లవం తరహాలో విత్తన విప్లవం రావాలి: గవర్నర్
హైదరాబాద్ మాదాపూర్ హెచ్‌ఐసీసీలో మూడు రోజులపాటు జరిగిన అంతర్జాతీయ విత్తన పరీక్షా సంఘం - ఇస్టా సదస్సు ముగిసింది. ఈ సదస్సును కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి ప్రారంభించగా... ముగింపు రోజు గవర్నర్ ఈఎస్‌ఎల్‌ నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వ్యవసాయ రంగం లాభసాటిగా మారి రైతు జీవన ప్రమాణాలు మారాలంటే హరిత విప్లవం, నీలి విప్లవం, శ్వేత విప్లవం తరహాలో విత్తన విప్లవం రావాలని గవర్నర్ ఆకాంక్షించారు.
విత్తనోత్పత్తిపై నూతన ఒరవడి సృష్టించిన ఇస్టా సదస్సు
దేశ, విదేశాల నుంచి 700 మంది బహుళ జాతి, జాతీయ ప్రైవేటు, ప్రభుత్వ రంగ విత్తన కంపెనీల ప్రతినిధులు, నిపుణులు, శాస్త్రవేత్తలు హాజరైన ఈ కీలక సదస్సులో... పెరుగుతున్న జనాభా నేపథ్యంలో ఆహార భద్రత, పోషకాహార భద్రత, రైతుల ఆదాయాలు రెట్టింపుపై సుధీర్ఘ మేధోమధనం సాగింది. దేశంలో... ప్రత్యేకించి తెలంగాణలో విత్తనోత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా రాష్ట్రీయ అవసరాలు తీర్చుకోవడం, ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి చేస్తుండటం ద్వారా కొత్త ఒరవడి సృష్టించినట్లైంది.
నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అందిండమే లక్ష్యం
పర్యావరణహిత పద్ధతుల్లో శాస్త్రీయ దృక్పథంతో విత్తన ఉత్పత్తి, నాణ్యత, పరీక్షా, ఆరోగ్యం, భవిష్యత్ తరాలకు గొప్ప ఆస్తి అందించేలా రైతులు ముందుకు సాగాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. దేశీయ, అంతర్జాతీయ విత్తన విపణిలో ఏటా వృద్ధి సాధిస్తున్న దృష్ట్యా బహుళ జాతి, కార్పొరేట్, ప్రైవేటు సంస్థలు ముందుకొచ్చి కొత్తగా విత్తన పరిశ్రమలు, ప్రాసెసింగ్ యూనిట్లు, శీతల గిడ్డంగులు ఏర్పాటు చేసినట్లైతే... నిరుద్యోగ యువతకు మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అందుకు అవసరమైన విత్తనాలు ఉత్పత్తి చేసే రైతులకు అధిక ధరలు లభించడం ద్వారా ఆదాయాలు మెరుగవుతాయనడంలో సందేహం లేదని అభిప్రాయపడ్డారు.
తెలంగాణ రైతులకు జర్మనీ టైక్నాలజీ
ప్రపంచంలో భవిష్యత్తు ఆహార భద్రత, విత్తన భరోసా దృష్ట్యా... ఉన్నత శ్రేణి నాణ్యత గల విత్తనోత్పత్తి అత్యంత ఆవశ్యం. వాతావరణ మార్పుల నేపథ్యంలో అధిక దిగుబడి ఇచ్చే పంటల విత్తన రకాలు, కొత్త వంగడాల సృష్టిపై శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు సాగిస్తున్నారు. జర్మనీ తన టైక్నాలజీ తెలంగాణ రైతాంగానికి అందిస్తోంది. త్వరలో మరో రెండు రాష్ట్రాల్లో సేవలందించేందుకు జర్మనీ సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రంలో విత్తన రంగం, విత్తనోత్పత్తి రైతులకు అన్ని రకాలుగా తమ మద్ధతు ఉంటుందని ఇస్టా భరోసా ఇచ్చింది.
మరో మూడేళ్లకు ఆఫ్రికా దేశాల్లో ఇస్టా సదస్సు
ప్రతిష్ఠాత్మక ఈ స‌ద‌స్సు నిర్వహ‌ణ ఫ‌లితాలు ప్రపంచ‌వ్యాప్తంగా విత్తనోత్పత్తిదారుల్లో సంతోష బీజాలు వెల్లివిరిసేందుకు దోహ‌ద‌ప‌డాల‌ని శాస్త్రవేత్తలు, నిపుణులు ఆకాంక్షించారు. ఇది విజయవంతమైన దృష్ట్యా మరోసారి ఇస్టా పాలకవర్గం సమావేశమై చర్చించిన అనంతరం మరో మూడేళ్లకు ఆఫ్రికా దేశాల్లో ఇస్టా సదస్సు నిర్వహించాలని నిర్ణయించడం విశేషం.

ఇవీ చూడండి: నూతన భవన నిర్మాణాల కేసు జులై8కి వాయిదా

Intro:హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉద్రిక్తత

Body:హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉద్రిక్తత

Conclusion:హైదరాబాద్: నిన్న రాత్రి ఒకటి గంటల సమయంలో లో హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉద్రిక్తత.....
సమీర్ అనే ఓ రౌడీ షీటర్ ను హబీబ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేసి దాచి ఉంచారని తప్పుడు సమాచారంతో సమీర్ బంధువులతో పాటు అతని స్నేహితులు సుమారు 50 మంది హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పై దాడికి యత్నించి పోలీస్ స్టేషన్ లోని పూలకుండీలను ధ్వంసం చేశారు..
సీఐ అమృత రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం వారు సమీర్ ని అరెస్ట్ చేయలేదని అతని గురించి వారికి ఎలాంటి సమాచారం లేదని తప్పుడు సమాచారంతో ఇలా చేయడం సరికాదని అన్నారు. ఒకవేళ సమీర్ మిస్ అయినట్లు ఉంటే వారికి కంప్లైంట్ ఇవ్వాలని అతను ఎక్కడున్నా ఆచూకీ కనిపెడతామని సిఐ అమృత రెడ్డి తెలిపారు...
ఈ సంఘటనతో కొన్ని గంటలపాటు హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
బైట్: అమృత్ రెడ్డి (సీఐ హబీబ్ నగర్).
నోట్:ఫీడ్ v sat ద్వారా పంపబడింది గమనించగలరు
Last Updated : Jun 29, 2019, 7:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.