ETV Bharat / state

ap cm jagan cbi case: జగన్​ కేసులో కౌంటర్​ దాఖలుకు గడువు కోరిన సీబీఐ.. చివరి అవకాశమన్న కోర్టు - ap news

హైదరాబాద్​లోని సీబీఐ, ఈడీ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. పెన్నా ఛార్జ్ షీట్‌లో జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు మరోసారి సీబీఐ గడువు కోరింది. పెన్నా సిమెంట్స్‌పై కౌంటరుకు చివరి అవకాశం ఇస్తున్నామని కోర్టు స్పష్టం చేసింది. జగన్ పిటిషన్‌పై కౌంటరు దాఖలుకు సీబీఐకి ఇదే చివరి అవకాశమని తెలిపింది. పెన్నా కేసులో విజయసాయిరెడ్డి, సబిత, శామ్యూల్, రాజగోపాల్ డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది.

ap cm jagan cbi case
ap cm jagan cbi case
author img

By

Published : Sep 6, 2021, 10:36 PM IST

పెన్నా ఛార్జ్ షీట్ నుంచి తన పేరు తొలగించాలని కోరుతూ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్​పై తదుపరి విచారణ రోజున కౌంటరు దాఖలు చేయాలని సీబీఐకి న్యాయస్థానం స్పష్టం చేసింది. సీబీఐ, ఈడీ కోర్టులో ఇవాళ జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ జరిగింది. జగన్ డిశ్చార్జ్ పిటిషన్​పై కౌంటరు దాఖలుకు సీబీఐ మరోసారి గడువు కోరింది. ఇదే చివరి అవకాశమని.. తదుపరి విచారణ రోజున జగన్​తో పాటు పెన్నా సిమెంట్స్ పిటిషన్లపై కౌంటరు దాఖలు చేయాలని న్యాయస్థానం స్పష్టం చేసింది.

పెన్నా సిమెంట్స్ నుంచి తన పేరు తొలగించాలని కోరుతూ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. జగతి పబ్లికేషన్స్, కార్మెల్ ఏషియా కంపెనీలు కూడా డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశాయి. సబిత ఇంద్రారెడ్డి, శామ్యూల్, రాజగోపాల్ డిశ్చార్జ్ పిటిషన్లతో పాటు పెన్నా ఛార్జ్ షీట్​పై విచారణ ఈనెల 13కి వాయిదా వేసింది. అరబిందో, హెటిరోలకు భూకేటాయింపులకు సంబంధించిన కేసులో వాదనలు వినిపించేందుకు ఎన్ ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరారు. ఈడీతో పాటు నిందితుల తరఫు న్యాయవాదులు కూడా అభియోగాల నమోదుపై వాదనలకు సిద్ధం కావాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. తన బదులు న్యాయవాది హాజరయ్యేలా అనుమతివ్వాలన్న జగన్ పిటిషన్​తో పాటు అరబిందో, హెటిరో ఈడీ ఛార్జ్ షీట్ పై విచారణను ఈనెల 13కి వాయిదా వేసింది.

ఇదీ చూడండి: jagan cbi cases: ఏపీ సీఎం జగన్ పెన్నా కేసులో డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు వాయిదా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.