ETV Bharat / state

అత్తింటి వేధింపులు... వివాహిత బలవన్మరణం - మృతికి భర్త, అత్తమామలే కారణం

వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌ అంబర్‌పేట్‌లో చోటు చేసుకుంది. మృతికి భర్త, అత్తమామలే కారణమని ఆరోపిస్తూ బాధిత బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

భర్త అత్తింటి వేధింపులతో గృహిణి బలవన్మరణం
author img

By

Published : Nov 3, 2019, 3:52 AM IST

హైదరాబాద్ అంబర్‌పేట్‌లో అనుమానాస్పద స్థితిలో ఓ గృహిణి మృతి చెందింది. అంబర్​ పేటకు చెందిన శివాని, సాయి సుఖిత్​లకు 2014 సంవత్సరంలో ప్రేమ వివాహం జరిగింది. సాయి సుఖిత్‌ సాఫ్ట్ వేర్​ ఇంజినీర్‌గా పనిచేస్తుండగా, శివాని ఓ ప్రైవేట్‌ బ్యాంకులో పనిచేస్తుండేది. అంబర్‌పేట్‌లోని లాల్‌బాగ్‌ బస్తీలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో తరచు భర్త, అత్తింటి వారు ఆమెను వేధించేవారని ఈ విషయం తమతో కూడా శివాని చెప్పుకోలేపోయిందని బాధితురాలి బంధువులు వాపోయారు. శుక్రవారం రాత్రి తన సోదరితో శివాని ఫోన్​లో మాట్లాడిందని, ఆ సమయంలో సంతోషంగానే ఉందన్నారు. తర్వాత గంట సేపటికే తన భార్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సుఖిత్‌ ఫోన్‌ చేసి తెలిపాడని శివాని కుటుంబ సభ్యులు అన్నారు.
ఇంటిపై కప్పు ఎత్తు తక్కువగా ఉండడం, అక్కడ ఉరేసుకునే అవకాశం లేనందు వల్ల మృతురాలి కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అత్తింటి వారే ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. అనంతరం ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మృతదేహానికి శవపరీక్ష నిర్వహించిన తర్వాత బంధువులకు అప్పగించారు. మృతదేహం చూసిన బంధువులు బోరున విలపించారు. ఆమె మృతికి కారణమైన భర్త, అత్తమామలను పోలీసులు కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

భర్త అత్తింటి వేధింపులతో గృహిణి బలవన్మరణం
ఇవీ చూడండి : కీర్తిరెడ్డి అబార్షన్​ చేయించుకున్న నర్సింగ్​హోమ్ సీజ్

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.