ETV Bharat / state

Terrace Garden: ఆరోగ్యంపై పెరిగిన స్పృహ.. నగర సేద్యంపై క్రమంగా పెరుగుతున్న అభిరుచి - telangana news

Terrace Garden: ఓ మార్పు కనిపిస్తోంది. కొవిడ్ నేపథ్యంలో ఆరోగ్యమే మహాభాగ్యం అన్న కోణంలో.. రోగ నిరోధక శక్తిగల ఆహారం తీసుకోవాలన్న స్పృహ పెరిగిపోతోంది. అదీ రసాయన, క్రిమిసంహార మందుల అవశేషాల్లేని ఆహారం తీసుకోవాలన్న జిజ్ఞాస.. ఎక్కువ కావడంతో వినియోగదారులు ఖర్చుకు వెనుకాడటం లేదు. నగర సేద్యం అత్యంత ప్రాధాన్యత సంతరించుకోవడంతో భాగ్యనగరంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో.. ప్రతి నెలా రెండు సార్లు ఔత్సాహిక ఇంటి పంటల సాగుదారులు, మహిళలకు శిక్షణ ఇస్తుంది.

Terrace Garden: ఆరోగ్యంపై పెరిగిన స్పృహ.. నగర సేద్యంపై క్రమంగా పెరుగుతున్న అభిరుచి

author img

By

Published : Mar 13, 2022, 3:59 AM IST

Updated : Mar 13, 2022, 4:21 AM IST

ఆరోగ్యంపై పెరిగిన స్పృహ.. నగర సేద్యంపై క్రమంగా పెరుగుతున్న అభిరుచి

Terrace Garden: ప్రతి ఒక్కరిలోనూ ఆరోగ్య స్పృహ పెరిగిపోతోంది. రసాయన అవశేషాలతో కూడిన కూరగాయలు, ఆకుకూరల వినియోగం వల్ల.. సంభవిస్తున్న దుష్ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని హైదరాబాద్ నాంపల్లి తెలంగాణ ఉద్యాన శిక్షణ సంస్థలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో నగర సేద్యంపై జరిగిన అవగాహన సదస్సు విజయవంతంగా ముగిసింది. నగరం నలుమూలల నుంచి ఔత్సాహిక గృహిణులు, యువతులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు.. ఇతర గృహ యజమానులు తరలివచ్చారు. ఏ మాత్రం అవగాహన లేకపోయినా ఇంటి పంటలు సాగు చేసుచేసుకునేందుకు అవసరమైన విజ్ఞానం, మెళకువలు, సాంకేతిక పరిజ్ఞానం అందించారు. వేసవి కాలం ప్రారంభమైన నేపథ్యంలో ఆకుకూరలు, కూరగాయల పంటల సాగుకు.. అత్యంత ప్రాధాన్యత ఇస్తూ నీటి యాజమాన్యాలు, కషాయాలు, వర్మీకంపోస్టు తయారీపై శిక్షణ ఇచ్చారు.

విస్తృతమవుతోన్న ఇంట పంటల సంస్కృతి

ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్యం పట్ల అత్యంత శ్రద్ధ పెరిగి స్వీయ ఇంటి పంటల సంస్కృతి విస్తృతమవుతోంది. జంట నగరాల్లో అదొక ఉద్యమ రూపం సంతరించుకుంది. ఐదారేళ్ల కిందట సరదాగా ప్రారంభించి.. మధ్యలో సరైన అవగాహన లేకపోవడంతో.. టెర్రస్, కిచెన్ గార్డెన్లు వదిలేసిన మహిళలు సైతం.. మళ్లీ తాజాగా ఉత్తేజితులై ముందుకు సాగుతున్నారు. సొంతంగా పండించుకుని ఆహారంలో భాగం చేసుకుని.. ఆస్వాదిస్తే ఆ కలిగే ఆనందమే వేరని శిక్షకులు సంతోషం వ్యక్తం చేశారు. గృహ యజమానులు సైతం అందుకు అనువుగా స్థలం ఎంపిక చేసుకుని.. నిర్మించుకుంటే భవిష్యత్తులో టెర్రస్ గార్డెనింగ్ అందంగా తీర్చిదిద్దుకోవచ్చని ఇంటీరియర్ డిజైనర్లు చెబుతున్నారు.

నైపుణ్యాలు పెంపొందించుకునేందుకు..

నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి అత్యంత దోహదపడుతున్న ఈ శిక్షణ కార్యక్రమాలు ప్రతి నెలా రెండో శనివారం, నాలుగో శనివారాల్లో సాగుతున్నాయి. 2018 నుంచి టెర్రస్ గార్డెన్ యూనిట్‌కు 50 శాతం రాయితీ ఆపేసిన ఉద్యాన శాఖ.. మళ్లీ ఇవ్వాలని యోచిస్తోంది. మంత్రివర్గ ఉపసంఘం ఆమోదిస్తే.. ఆయా ప్రోత్సాహకాలు ఇచ్చి వెన్నుతట్టనున్నామని ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు.

టెర్రస్​ గార్డెన్లు లక్ష్యంగా..

తదుపరి శిక్షణా కార్యక్రమం ఈ నెల 27న నాంపల్లి ఉద్యాన శిక్షణ సంస్థలో జరగనున్న దృష్ట్యా ఆసక్తి ఉన్న వారు.. తమ పేర్లు నమోదు చేసుకోవచ్చు. ఈ ఏడాది చివరి నాటికి నగరంలో లక్ష టెర్రస్ గార్డెన్లు ఏర్పాటు లక్ష్యంగా ఉద్యానశాఖ అధికారులు ముందుకెళ్తున్నారు.

ఇదీ చదవండి:

Last Updated : Mar 13, 2022, 4:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.