ETV Bharat / state

Telangana Projects Overflows : జలకళను సంతరించుకున్న గోదావరి ప్రాంత ప్రాజెక్టులు - కడెం ప్రాజెక్టు

Huge Flood Water For Telangana Projects : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి బేసిన్​లోని ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. శ్రీరాం సాగర్​ ప్రాజెక్టు, కడెం ప్రాజెక్టు, నిజాంసాగర్​ ప్రాజెక్టు వంటి అనేక ప్రాజెక్టుల్లోకి భారీ వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో నిండుకుండలా మారాయి. మరోవైపు రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Telangana Projects
Telangana Projects
author img

By

Published : Jul 25, 2023, 5:38 PM IST

Telangana Projects Filled With Flood Water : రాష్ట్రంతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ఉద్ధృతితో గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. శ్రీరామసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 90.31 టీఎంసీలు కాగా.. ఇప్పటికే 63.75 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,091 అడుగులు కాగా.. ప్రస్తుతం 1,084 అడుగులకు చేరుకుంది. ఈ ప్రాజెక్టుకు తాజాగా ఇన్​ఫ్లో 26,296 క్యూసెక్కులు నీరు రాగా.. 882 క్యూసెక్కుల నీటిని బయటకు వదులుతున్నారు.

Huge Flood Water For Nizamsagar Project : నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు 48,475 క్యూసెక్కులు, కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి 5,300 క్యూసెక్కుల వరద నీరు వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నిజాంసాగర్​ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1400 అడుగులకు చేరింది. ఈ ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 17.80 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 11.91 టీఎంసీలుగా నమోదైంది.

కడెం ప్రాజెక్టు
కడెం ప్రాజెక్టు

మిగిలిన ప్రాజెక్టులకు భారీగా వరద నీరు : సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా.. ప్రస్తుతానికి 21.48 టీఎంసీలకు చేరుకుంది. ఇక ప్రస్తుతం 5.99 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టులోకి వస్తుండగా.. 385 క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నట్లు తెలిపారు. మేడిగడ్డ వద్ద లక్ష్మీ బ్యారేజీకి 5,49,210 క్యూసెక్కుల వరద నీరు చేరుతుండగా.. 5.49 లక్షల క్యూసెక్కుల నీటిని 75 గేట్ల ద్వారా వదులుతున్నట్లు వివరించారు. అదేవిధంగా మిడ్ మానేరు రిజర్వాయర్​లో 27.50 టీఎంసీల నీటి సామర్థ్యం ఉండగా ప్రస్తుతం 15.72 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

జంట జలాశయాలకు వచ్చిన చేరుతున్న భారీ వరద : హైదరాబాద్​ నగర శివారులోని జంట జలాశయాలు నీటికుండలా మారి జలకళను సంతరించుకుంది. హిమాయత్​ సాగర్​, ఉస్మాన్​ సాగర్​ జలాశయాలకు భారీస్థాయిలో వరద నీరు పెరుగుతోంది. హిమాయత్​సాగర్​ జలాశయానికి 2000 క్యూసెక్కుల వరద ప్రవాహం ఎక్కువగా రావడంతో 4 గేట్లు ఎత్తి.. మూసీ నదిలోకి 2750 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. హిమాయత్​సాగర్​ పూర్తిస్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా.. ప్రస్తుతం 1761.75 అడుగులకు చేరింది. ఇంకా ఉస్మాన్​సాగర్​లోకి 1200 క్యూసెక్కుల వరద నీటి ప్రవాహం వస్తోంది. ఉస్మాన్​సాగర్​ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులుండగా.. ప్రస్తుత నీటిమట్టం 1786.10 అడుగులకు చేరింది.

ప్రస్తుత నీటి మట్టాలు :

ప్రాజెక్టు

నీటిమట్టం

(పూర్తిస్థాయి)

నీటిమట్టం

(ప్రస్తుత స్థాయి)

పూర్తి నీటి నిల్వ

(టీఎంసీలు

ప్రస్తుత నీటి నిల్వ

(టీఎంసీలు)

1.శ్రీరాంసాగర్​ ప్రాజెక్టు1,091 అడుగులు1,084 అడుగులు90.31 63.75
2. నిజాంసాగర్​ ప్రాజెక్టు1405 అడుగులు1400 అడుగుల17.80 11.91
3. సింగూరు ప్రాజెక్టు - -29.91 21.48
4. మిడ్​ మానేరు - -27.50 15.72
5. హిమాయత్​సాగర్​1763.50 అడుగులు1761.75 అడుగులు - -
6. ఉస్మాన్​ సాగర్​1790 అడుగులు1786.10 అడుగులు - -

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.