ETV Bharat / state

కరోనా కాష్ఠం.. కాటికాపరులకు అనుకోని కష్టం..!

ఓవైపు మండే చితిమంటలు. మరోవైపు ఆప్తుల ఆర్తనాదాలు.! అసాధారణరీతిలో శవాలు.! వరుసపెట్టి దహనాలు.! కొవిడ్ కల్లోలానికి వల్లకాడు సైతం వల్లకాదంటోంది. మరుభూమిలో కట్టెపట్టుకుని నిలుచుకునే కాటికాపరులే కాలుతున్న కాష్ఠాన్ని చూసి కన్నీరు పెడుతున్నారు. చనిపోకముందు కొవిడ్ చికిత్స అందించిన వైద్యులు శవాన్ని అప్పగిస్తూ గుండెపోటుగా నమోదు చేయడం విస్మయం కలిగిస్తోంది.

huge-dead-bodies-funerals-in-bongarala beedu-cemetery-in-guntur-district
కరోనా కాష్ఠం.. కాటికాపరులకు అనుకోని కష్టం..!
author img

By

Published : Apr 22, 2021, 6:38 AM IST

ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరులోని బొంగరాలబీడు మహాప్రస్థానంలో కట్టెలు కాలుతూనే ఉన్నాయి. కొన్నిరోజులుగా ఈ శ్మశానానికి మృతదేహాలు వరుసకడుతున్నాయి. ఒకప్పుడు నాలుగైదు మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించిన కాటికాపరులు ఇప్పుడు రోజూ పదుల సంఖ్యలో శవాలను దహనం చేస్తున్నారు. బొంగరాల బీడులో గత నాలుగు రోజుల్లోనే ఏకంగా 141 మృతదేహాల్ని ఇక్కడ దహనం చేశారు.

కరోనా కాష్ఠం.. కాటికాపరులకు అనుకోని కష్టం..!

బొంగరాలబీడు మహాప్రస్థానానికి జీజీహెచ్ తోపాటు కొత్తపేటలోని ప్రైవేటు ఆస్పత్రుల నుంచి మృతదేహాలు తెస్తుంటారు. అందులో 80 శాతం మృతదేహాల్ని జిప్ వేసే తెస్తున్నారు. కొవిడ్ వైరస్ వల్లే ఇన్ని మరణాలు నమోదవుతున్నాయనేది డయాగ్నసిస్ నివేదికలు చెప్తున్నాయి. కానీ శవాన్ని అప్పగించేటప్పుడు గుండెపోటుగా రాసి పంపుతున్నారు. మరికొందరి నివేదికల్లో బైలేటరీ నిమోనియాగా, మరికొందరి నివేదికల్లో నిమోనియా వైరల్‌గా చూపుతున్నారు.

వైద్య చికిత్సలు అందించేటప్పుడు కరోనాగా చెప్పి మృతిచెందిన తర్వాత మాత్రం వీటిని సాధారణ గుండెపోటుగా చూపడం వెనుక కారణాలు బంధువులకు అంతుపట్టడం లేదు. సాధారణ మరణాలైతే అంతిమ సంస్కారాలకు బంధువులు వెళ్లేవారు. కొన్నిరోజులుగా వస్తున్న మృతదేహాల వెంట ఎవరూ రావడం లేదు. అమ్మ ఛారిటబుల్ ట్రస్టు, రుద్ర ట్రస్టు వంటి స్వచ్ఛంద సంస్థలే అంత్యక్రియలు నిర్వహిస్తున్నాయి. శ్మశానాలూ రద్దీగా మారడంతో అక్కడా పారిశుద్ధ్యాన్ని పెంచాలని కోరుతున్నారు.

ఇవీ చదవండి: ఏపీలో కరోనా విలయం.. ఒక్కరోజే పదివేలకు చేరువలో కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.