కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి మాట్లాడేవారని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. 79వ జయంతి సందర్భంగా... ఆయన సమాధి వద్ద ఘనంగా నివాళులు అర్పించారు. జైపాల్ రెడ్డి తనకు అత్యంత సన్నిహితుడని తెలిపారు. రాజకీయ రంగంలో ఉన్నతస్థాయి నాయకుడని కొనియాడారు.
ఉత్తమ విమర్శకుడిగా, ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఆయన గుర్తింపు పొందారని గవర్నర్ గుర్తు చేశారు. పెట్రోలియం శాఖను నిర్వహిస్తున్న సమయంలో పలు విషయాల్లో... పార్టీ అధిష్ఠానం, ప్రధాని కార్యాలయం నుంచి ఒత్తిడులు వచ్చినా దృఢమైన నిర్ణయాలు తీసుకున్నారని ప్రశంసించారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో తనదైన ముద్రవేశారని అన్నారు.
ఇదీ చదవండి: 'సంక్రాంతి సందర్భంగా మోదీ నిజమైన క్రాంతిని అందించారు'