ETV Bharat / state

వేడి చేసిందా నాయనా.. అయితే ఇవి తినేయ్.. రుచితో పాటు ఆరోగ్యం బోనస్ - recipes in summer for good health

How to make Curd pachadi : అసలే ఎండకాలం సూర్యా బ్రో ఏ మాత్రం జాలి చూపించకుండా డిగ్రీల మీద డిగ్రీలు పెంచుకుంటూ ఎండలతో విరుచుకుపడుతున్నాడు. ఈ ఎండలకు భయపడి ఏమైపోతామోనని.. ఇంటి దగ్గర అమ్మ, నాన్నమ్మ, అమ్మమ్మలు ఏమో చిన్నా.. మజ్జిగ, నిమ్మకాయ నీళ్లు, వాటర్​ మిలన్​ జ్యూస్ తాగు అంటూ తెగ ఇబ్బంది పెట్టేస్తుంటారు..! అయితే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా అవి చటుక్కున తాగేయండి అవి మంచివే.. అవి మన శరీరానికి చలువ చేస్తాయి. కానీ వాటికి పోషక విలువలు జోడిస్తే మరింత రుచితో పాటు ఆరోగ్యం వస్తుందంటున్నారు భోజన ప్రియులు. ఈ నేపథ్యంలో వేసవిలో చల్లదనం చేకూర్చే వంటకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Curd Pachdi
Curd Pachdi
author img

By

Published : May 23, 2023, 1:40 PM IST

Updated : May 23, 2023, 2:07 PM IST

How to make Curd pachadi : వేసవి కాలంలో చలువ చేసే పదార్థాలకు ఉండే డిమాండ్‌ అంతా ఇంతా కాదు. అలాగని పెరుగు, మజ్జిగలతోనే కాలక్షేపం చేయలేం కదా. వాటికి పోషక విలువలు ఉన్నా ఊరికే అవే తినాలంటే చిరాకు. అందుకే వాటిని కాస్త వెరైటీగా వండుకుంటే రుచితో పాటు ఆరోగ్యం బోనస్​గా వస్తుంది. అలాంటి కొన్ని చలువ చేసే పదార్థాలు, వాటి తయారీ విధానం ఇప్పుడు చుద్దాం.

బెండకాయ పెరుగు పచ్చడి
బెండకాయ పెరుగు పచ్చడి
  • బెండకాయ పెరుగు పచ్చడి

కావాల్సిన పదార్థాలు : బెండకాయలు పావు కిలో, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, ఆవాలు, పసుపు, ఇంగువా, నూనె, ఉప్పు, చిక్కని పెరుగు( ఇవన్నీ తగిన మోతాదులో తీసుకోవాలి)

తయారీ: ముందుగా బెండకాయలను తరిగి ముక్కలుగా చేసుకోవాలి. ఆ తరువాత నూనెలో వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. మిక్సీలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వీటిని వేసి మరి పేస్టులా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఆ తరువాత ఒక ప్యాన్​లో చెంచా నూనె వేసి వేడెక్కాక ఆవాలు వేయాలి. అవి వేడిక్కిన తరువాత దీనిలో ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ముద్ద, ఇంగువ, పసుపు వేసి పచ్చివాసన పోయేంతవరకూ వేగనివ్వాలి. స్టౌ కట్టేసి కాస్త చల్లారనిచ్చి బెండకాయ ముక్కలు, కప్పు పెరుగు, తగినంత ఉప్పు వేసుకుంటే నోరురూరించే బెండకాయ పెరుగు పచ్చడి రెడీ.

దొండకాయ పెరుగు పచ్చడి
దొండకాయ పెరుగు పచ్చడి
  • దొండకాయ పెరుగు పచ్చడి

కావాల్సినవి: గండ్రంగా తరిగిన దొండకాయల ముక్కలు, వాటికి తగినట్లుగా పచ్చిమిర్చి, కొత్తిమీర, నూనె, ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు, చిలికిన పెరుగు, నీళ్లు.

తయారీ ఎలాగో ఇప్పుడు చుద్దాం..: మిక్సీలోకి అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత స్టౌపై కళాయిలో నూనె పోసి వేడి చేసుకోవాలి. అందులో పోపు దినుసులు వేయాలి. అప్పుడు వాటికి ఎండుమిర్చి, కరివేపాకు వేసి తగిన మంటలో వేయించాలి. తర్వాత దొండకాయ ముక్కలు, పసుపు వేయాలి. దొండకాయ ముక్కలు బాగా వేగనివ్వాలి. తరువాత ఉప్పు, ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్‌ అందులో వేసి కలపాలి. 2 నిమిషాలు వేయించిన తరువాత తీసివేయాలి. దొండకాయ ముక్కలు చల్లారాక చిలికిన పెరుగు, కాసిని నీళ్లు వేసి కొద్దిగా కలపాలి. మీకు ఇష్టమైన దొండకాయ పచ్చడి తయారీ అవుతోంది. అది వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది.

మామిడికాయ పెరుగు పచ్చడి
మామిడికాయ పెరుగు పచ్చడి
  • మామిడికాయ పెరుగు పచ్చడి

కావాల్సినవి: పెరుగు కొద్దిగా, పచ్చి మామిడికాయ ఒకటి, చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు రుచికి తగినంత, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, నూనె (తగినంతగా తీసుకోవాలి)

తయారీ: ముందుగా ప్యాన్​లో నూనె వేసుకొని.. నూనె కాగిన తరువాత ఆవాలు వేయాలి. దాంట్లో కొద్దిగా ఇంగువా, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లి, పచ్చిమిర్చి కాసేపు వేగనివ్వాలి. ఆ తరువాత అందులో మామిడి ముక్కలు, పసుపు వేసి మరికాసేపు స్టౌపై ఉంచాలి. దీనికి తగినంత ఉప్పు వేసి మంట తగ్గించుకోవాలి. అప్పుడు చిలికిన పెరుగు, కాసిని నీళ్లు కలిపి స్టౌ ఆపేయాలి. చివరగా కొత్తిమీర వేస్తే మామిడికాయ పెరుగు పచ్చడి సిద్ధం.

ఇవీ చదవండి:

Last Updated : May 23, 2023, 2:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.