ETV Bharat / state

బస్ స్టేషన్లలో పార్కింగ్ లాట్, క్యాంటీన్లు, స్టాల్స్ నడపాలనుకుంటున్నారా? - ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా? - TSRTC Invites Tenders for Parking Lot

How to Get TSRTC Parking Lot Tender : టీఎస్​ఆర్టీసీ కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలనే వారికి మంచి అవకాశం కల్పిస్తోంది. ఈ మేరకు బస్టాండ్స్​ ఆవరణలో ఖాళీగా ఉన్న వివిధ షాపులు, స్థలాలు, క్యాంటీన్ స్టాల్స్, పార్కింగ్ స్థలాల నిర్వహణ కొరకు టెండర్స్ ప్రకటించింది. ఆసక్తి ఉన్నవారి నుంచి అప్లకేషన్స్ స్వీకరిస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా..

TSRTC
TSRTC
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 26, 2023, 12:17 PM IST

How to Get TSRTC Parking Lot Tender : మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారా? అయితే మీకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మంచి సువర్ణావకాశం కల్పిస్తోంది. ఎప్పటికప్పుడు ప్రజలకు ఉపయోగపడే విధంగా సరికొత్త నిర్ణయాలు తీసుకుంటున్న టీఎస్​ఆర్టీసీ తాజాగా మరో అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. అదేంటంటే.. టీఎస్​ఆర్టీసీ(TSRTC) బస్టాండ్ ఆవరణలో పలు వ్యాపారాలు నిర్వహించేందుకు అవకాశం ఇస్తోంది. ఈ మేరకు 4 అంశాలకు సంబంధించి టెండర్లు ప్రకటించింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. దీనికోసం ఆసక్తి గల వారి నుంచి అప్లికేషన్స్ స్వీకరిస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

  • టీఎస్​ఆర్టీసీ ప్రకటించిన ఈ టెండర్ల ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. వాటిలో మొదటిది ఏంటంటే.. హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, మెదక్, మహబూబ్​నగర్, నల్గొండ, రంగారెడ్డి, నిజామాబాద్, సికింద్రాబాద్, ఆదిలాబాద్, వరంగల్ రీజియన్లలో ఉన్న వివిధ బస్​స్టేషన్లతో పాటు హైదరాబాద్​లోని తార్నాక హాస్పిటల్​లో ఖాళీగా ఉన్న షాపులు, స్థలాలు, క్యాంటీన్ స్టాల్స్, పార్కింగ్ స్థలాల నిర్వహణ కొరకు తెలంగాణ ఆర్టీసీ టెండర్లను ఆహ్వానిస్తోంది.
  • ఇకపోతే రెండో అంశమేమిటంటే.. తెలంగాణలోని 33 స్థలాల్లో పెట్రోల్ బంకులు నెలకొల్పుటకు కూడా అవకాశం ఇస్తోంది. వీటిని నిర్వహించేందుకు సర్వీస్ ప్రొవైడర్ల నియామకానికి దరఖాస్తులు స్వీకరిస్తోంది.
  • అదేవిధంగా మహబూబ్‌నగర్, నల్గొండ రీజియన్లలో బస్ డిపోలు, బస్ స్టేషన్లలో లాజిస్టిక్స్ సర్వీసెస్ నిర్వహణ కోసం కూడా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టెండర్లను ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్నవారు అప్లై చేసుకోండి.
  • ఇక చివరగా.. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్గొండ రీజియన్లలోని బస్ డిపోలు, బస్ స్టేషన్లతో పాటు జోనల్ వర్క్‌షాప్, ఉప్పల్‌లో ఔట్‌సోర్సింగ్ ద్వారా విధులు నిర్వహించేందుకు టీఎస్​ఆర్టీసీ అప్లికేషన్స్ స్వీకరిస్తోంది. ఆసక్తిగల వారు టెండర్ ప్రక్రియలో పాల్గొనవచ్చని పేర్కొంది. ఈ మేరకు టీఎస్​ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విటర్​లో టెండర్లకు సంబంధించి ఓ ప్రకటనను పోస్ట్ చేశారు. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఇప్పుడే అప్లై చేసుకోండిలా..

మహాలక్ష్మీ స్కీమ్ ఎఫెక్ట్ - బస్సుల్లో సీట్ల కోసం మగవాళ్ల పాట్లు - పురుషుల కోసం ఆర్టీసీ ప్రత్యేక చర్యలు

వీటికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఇదే..

  • తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికారిక వెబ్‌సైట్ https://www.tsrtc.telangana.gov.in/ లో అప్లికేషన్ ఫామ్స్ ఉంటాయి.
  • మీరు అప్లై చేసుకోవాలంటే.. ముందుగా ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. ఆ తర్వాత Tenders సెక్షన్‌లోకి వెళ్తే.. అక్కడ ప్రాంతాల వారీగా టెండర్ల వివరాలు, అప్లికేషన్ ఫామ్స్ కనిపిస్తాయి. అయితే ఈ టెండర్లలో పాల్గొనాలనుకునేవారు ముందుగా వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోవాలి.
  • ఇకపోతే ఆన్‌లైన్‌లో టెండర్లలో పాల్గొనాలనుకునేవారు https://tender.telangana.gov.in/ వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
  • ఆ తర్వాత మీరు దేనికి టెండర్ వేయాలనుకుంటున్నారో దానికి టెండర్ వేయాల్సి ఉంటుంది. నియమనిబంధనలకు అనుగుణంగా వచ్చిన టెండర్లనే అనుమతిస్తారన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి.
  • వేరువేరు టెండర్లకు వేరువేరు లాస్ట్ డేట్స్ ఉన్నాయి. అదేవిధంగా నోటిఫికేషన్‌లోనే పార్కింగ్ లాట్ విస్తీర్ణం, షాప్ విస్తీర్ణం, అందులో ఏ షాప్ నిర్వహించాలి అనే వివరాలు సమగ్రంగా ఉంటాయి.
  • మొబైల్ స్టోర్, ఛాట్ బండార్, జ్యూస్ సెంటర్, జిరాక్స్ అండ్ స్టేషనరీ... ఇలా వేరువేరు బిజినెసెస్ కోసం షాపులు అందుబాటులో ఉన్నాయి. ఇక ఆసక్తి ఉన్న వారు ఇప్పుడే అప్లై చేసుకోండి.

ఇదేం అభిమానం - బిగ్​బాస్​ ఫ్యాన్స్​పై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్​ ఫైర్

TSRTC Proposed RTC Employee Age Limit Increase : 'టీఎస్​ఆర్టీసీ పదవీ విరమణ వయస్సు 61 సంవత్సరాలకు పెంచాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.