ETV Bharat / state

How to Check TS LRS Application Status 2023: తెలంగాణ LRS అప్లికేషన్​ స్టేటస్​.. ఇలా తెలుసుకోండి!

How to Check TS LRS Application Status 2023: అనధికార లే-అవుట్లు, అక్రమ నిర్మాణాల క్రమబద్ధీకరణకు అవకాశం ఇస్తూ.. తెలంగాణ సర్కార్​ ఎల్ఆర్ఎస్ (ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్) ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఒకవేళ మీరు LRS కు అప్లై చేసుకుంటే.. దాని స్టేటస్​ను ఎలా తెలుసుకోవాలో ఇక్కడ చూద్దాం.

author img

By ETV Bharat Telangana Team

Published : Sep 12, 2023, 5:02 PM IST

How_to_check_TS_LRS_Application_Status
How_to_check_TS_LRS_Application_Status

How to Check TS LRS Application Status 2023: అనుమతుల్లేకుండా చేపట్టిన లే-అవుట్లు, అక్రమ నిర్మాణాల రెగ్యులరైజేషన్ కు అవకాశం ఇస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్​కు దరఖాస్తు చేసుకోవడానికి 15 అక్టోబర్​, 2020 చివరి తేదీగా ప్రకటించిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే.. ఇలాంటి దరఖాస్తులు దాదాపుగా.. 20 లక్షలకు పైగా వచ్చినట్టు సమాచారం. ఈ ఎల్ఆర్ఎస్ రిజిస్ట్రేషన్ ఫీజును రూ.1000గా.. లే-అవుట్ అప్లికేషన్ ఫీజును రూ.10,000గా ప్రభుత్వం ఖరారు చేసింది.

100 గజాలలోపు ప్లాటు కలిగి ఉన్న వాళ్లు రెగ్యులరైజేషన్ ఛార్జీల కింద గజానికి రూ.200 చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇక 100 నుంచి 300 గజాల వరకు ఉన్న స్థలాలకు రెగ్యులరైజేషన్ ఛార్జీలు గజానికి రూ.400గా ఖరారు చేశారు. అదేవిధంగా.. 300 నుంచి 500 గజాల వరకు ఉంటే.. గజానికి రూ.600 రెగ్యులరైజేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీలకు కూడా ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ వర్తిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది.

How to Claim LPG Insurance Policy: గ్యాస్​ సిలిండర్​ పేలితే ఇన్సూరెన్స్​.. ఎలా పొందాలో మీకు తెలుసా..?

ప్రభుత్వం ప్రకటించిన క్రమబద్ధీకరణ పథకంలో భాగంగా.. 125 చదరపు గజాల్లోపు స్థలాలను ఆక్రమించుకొని ఇండ్లు కట్టుకున్నవారికి ఉచితంగా క్రమబద్ధీకరణ అవుతుంది. ఇక 126 నుంచి 250 చదరపు గజాల వరకు ఆక్రమించినవా రు భూమి మార్కెట్‌ ధరలో 50 శాతం ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. 251 నుంచి 500 చదరపు గజాల వరకు విస్తీర్ణంలో ఇండ్లు నిర్మించుకున్నవారు మార్కెట్‌ ధరలో 75 శాతం ఫీజు చెల్లించాలి. 500 నుంచి 1000 గజాల వరకు ఉంటే ప్రభుత్వ ధరను వంద శాతం చెల్లించాల్సి ఉంటుంది.

క్రమబద్ధీకరణ ప్రక్రియకు సంబంధించి మీ -సేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నివాసానికి సంబంధించిన పలు ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆర్డీవో చైర్మన్‌గా, తహసీల్దార్‌ సభ్యులుగా ఉండే కమిటీ ఈ దరఖాస్తులపై నిర్ణయం తీసుకుంటుంది. మీరు గనక.. LRS కు అప్లై చేసుకుంటే.. దాని స్టేటస్​ను ఎలా తెలుసుకోవాలో ఇక్కడ చూద్దాం.

TS LRS Application Status 2023 Process:

  • ముందుగా అధికారిక వెబ్​సైట్​ను సందర్శించండి. https://lrs.telangana.gov.in
  • తర్వాత స్క్రీన్​పై Home బటన్​పై క్లిక్​ చేయాలి.
  • హోమ్​పేజీలో కుడి వైపున ఉన్న Know Your Application Status ఆప్షన్​పై క్లిక్​ చేయండి.
  • తర్వాత మీ ఫోన్​ నెంబర్​ను ఎంటర్​ చేసి.. Generate OTP ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • అప్లికేషన్​ సమయంలో ఇచ్చిన ఫోన్​ నెంబర్​ను మాత్రమే ఎంటర్​ చేయాలి
  • మీ ఫోన్​కు వచ్చిన ఓటీపీని ఎంటర్​ చేసి.. Validate OTP ఆప్షన్​పై క్లిక్​ చేయాలి.
  • అనంతరం.. ఎన్ని LRS ల కోసం అప్లై చేయటం జరిగిందో అవి స్క్రీన్​ మీద చూపిస్తాయి.
  • ఆ లిస్ట్​లో మీకు కావాల్సిన దానిని డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.
  • ఇందుకోసం.. Action కింద ఉన్న డౌన్​లోడ్​ బటన్​పై క్లిక్​ చేస్తే చాలు.

How to Apply For Duplicate Voter ID Card in Online : ఓటర్ కార్డు పోయిందా..? డోన్ట్​వర్రీ.. ఇలా పొందండి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.