సికింద్రాబాద్ చిలకలగూడ పీఎస్ పరిధిలో ఓ గృహిణి అదృశ్యమైంది. మహబూబ్నగర్ జిల్లా దాచేపల్లి మండలం అణ్వాడ గ్రామానికి చెందిన శిరీష, సంజన్న పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంతకాలం క్రితం నగరానికి వలస వచ్చి షాబాద్గూడలో నివాసముంటున్నట్లు పోలీసులు తెలిపారు.
ఈ నెల 17న ఇంట్లోంచి వెళ్లి.. తిరిగి రాలేదని భర్త తెలిపాడు. సన్నిహితులు, బంధువులను ఆరా తీసినప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం లేనందున సంజన్న పోలీసులకు ఫిర్యాదు చేశాడుు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండిః వరుస రోడ్డు ప్రమాదాలు.. నిర్లక్ష్యమే కారణమా?