ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ జలమయం అయింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగి ఇళ్లు నేలమట్టం అయ్యాయి. గోషామహల్ డివిజన్ కొత్త బస్తీలోని ఆర్య సమాజ వద్ద ఓ పాత భవనం కుప్పకూలింది. ఇంటి యజమాని పూజ చేసుకుని బయటికి వస్తున్న సమయంలో ఒక్కసారిగా కూలినట్లు బాధితులు తెలిపారు.
ఇంట్లో ఎవరూ లేని కారణంగా పెద్ద ప్రమాదం తప్పిందని అంటున్నారు. స్వల్ప ఆస్తి నష్టం జరిగింది. గోషామహల్ కార్పొరేటర్ ముఖేశ్ సింగ్ కూలిన ఇంటిని పరిశీలించారు. ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చదవండి: ఇళ్లలో వరద నీళ్లు... ప్రజల గుండెనిండా కన్నీళ్లు